Lynch syndrome : అరుదైన, సంక్లిష్టమైన కేసుకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ చికిత్స
శరీరంలోని DNA లోపాలను పరిష్కరించాల్సిన జన్యువులలో పరివర్తన కారణంగా ఇది జరుగుతుంది. ఈ జన్యువులు సరిగ్గా పనిచేయనప్పుడు, దెబ్బతిన్న కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి.
- By Latha Suma Published Date - 05:36 PM, Thu - 27 February 25

Lynch syndrome : లించ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగిలో మూడు మెటాక్రోనస్ క్యాన్సర్ లకు సంబంధించిన అరుదైన మరియు సంక్లిష్టమైన కేసుకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరి, విజయవాడ విజయవంతంగా చికిత్స చేసింది. లించ్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన పరిస్థితి, ఇది ఒక వ్యక్తికి కొన్ని క్యాన్సర్‌లు, ముఖ్యంగా పెద్దప్రేగు, గర్భాశయం, అండాశయం, ఉదరం మరియు ఇతర క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలోని DNA లోపాలను పరిష్కరించాల్సిన జన్యువులలో పరివర్తన కారణంగా ఇది జరుగుతుంది. ఈ జన్యువులు సరిగ్గా పనిచేయనప్పుడు, దెబ్బతిన్న కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది.
Read Also: Mamata Banerjee : దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు నిరవధిక దీక్ష చేస్తా: దీదీ
రోగి మొదట రొమ్ము క్యాన్సర్‌తో బారిన పడ్డారని గుర్తించటం జరిగింది. చికిత్స లో భాగంగా ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. తరువాత సహాయక చికిత్సలలో భాగంగా కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ చేయించుకున్నారు. 2019లో, సాధారణ పరీక్షలలో భాగంగా , ఆమెకు నాలుక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కణితిని తొలగించడానికి ఆమెకు శస్త్రచికిత్స జరిగింది, తరువాత తదుపరి చికిత్స కోసం కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ చేయబడ్డాయి. ఆమెకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించగా, 2024లో ఎడమ పెద్దప్రేగు (పెద్దప్రేగులో భాగం)లో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. తదుపరి పరీక్షలలో ఎడమ పెద్దప్రేగు దిగువ భాగంలో కూడా పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించబడింది. పెద్దప్రేగు యొక్క ప్రభావిత భాగాన్ని తొలగించడానికి ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్సతో చికిత్స అందించబడింది.
ఆ తర్వాత క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించడానికి కీమోథెరపీని అందించారు. సమగ్రమైన మరియు బహుళ విభాగ చికిత్సా విధానానికి డాక్టర్ ఎన్. సుబ్బారావు, డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ మణికుమార్ ఎస్ మరియు డాక్టర్ ఇషాంత్ ఐ నాయకత్వం వహించారు. రోగికి సరైన సంరక్షణ అందించటంతో పాటుగా కోలుకునేలా చూసుకున్నారు. ఒకే రోగిలో మూడు మెటాక్రోనస్ క్యాన్సర్ల ను దృష్టిలో ఉంచుకుని చేసిన జన్యు నిర్దారణ పరీక్షల ద్వారా రోగికి లించ్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడు వేర్వేరు ప్రాణాంతకత క్యాన్సర్ల ను దృష్టిలో ఉంచుకుని, రోగి జన్యు ఉత్పరివర్తన పరీక్ష చేయించుకున్నారు, ఇది జన్యు ఉత్పరివర్తనను, లించ్ సిండ్రోమ్ ను నిర్ధారించింది.
Read Also: Congo Unknown illness: కాంగో దేశంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 50కి పైగా మరణాలు!