HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Indefinite Initiation Before Ec Of Corrective Action Not Taken Mamata Banerjee

Mamata Banerjee : దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు నిరవధిక దీక్ష చేస్తా: దీదీ

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు.

  • Author : Latha Suma Date : 27-02-2025 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indefinite initiation before EC of corrective action not taken: Mamata Banerjee
Indefinite initiation before EC of corrective action not taken: Mamata Banerjee

Mamata Banerjee : తృణమూల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పశ్చిమ బెంగాల్‌ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ చేర్చుతోందని దుయ్యబట్టారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని మమతా బెనర్జీ హెచ్చరించారు.

Read Also: Congo Unknown illness: కాంగో దేశంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 50కి పైగా మ‌ర‌ణాలు!

ఓటర్ల జాబితాను సరిచేసి, తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేపడతానని అన్నారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు 215 చోట్ల విజయం సాధిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీకి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే విజయం సాధించలేమని తెలుసునని, అందుకే తప్పుడు జాబితాను రూపొందించే పనిలో పడిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ రావని, బయట వ్యక్తులు (బీజేపీ) బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని తాము అనుమతించబోమన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు హరియాణా, గుజరాత్‌ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లోనూ బీజేపీ ఈ తరహా వ్యూహాలను అమలు చేసిందన్నారు.

Read Also: SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వ‌ద్ద‌కు చేరుకున్న హ‌రీశ్‌రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిర‌స‌న

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • ec
  • Fake Voters
  • mamata banerjee
  • Trinamool Congress meeting
  • West Bengal Electoral Roll

Related News

Mamata Banerjee

Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) మంగళవారం (జూన్ 9, 2026) నాడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి (30B, హరీష్ ఛటర్జీ వీధి) చేరుకుంది. తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ నివాసంలో సోదాలు నిర్వహించాలని CID అధికారులు భావించారు. ఆ చిరునామా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేర్కొన

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    • Sunny Leone: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd