HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >A Wonderful Chapter Has Ended Cm Chandrababu

Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు

విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి.

  • Author : Latha Suma Date : 12-05-2025 - 6:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
A wonderful chapter has ended: CM Chandrababu
A wonderful chapter has ended: CM Chandrababu

Virat Kohli :  భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ ఆటతీరు, క్రీడాపట్ల నిబద్ధత, నాయకత్వ గుణాలను ప్రశంసిస్తూ, ఆయన టెస్టు కెరీర్‌ ముగింపు భారత క్రికెట్‌ చరిత్రలో ఓ మైలురాయిగా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి. అతడు దేశానికి గర్వకారణంగా నిలిచాడు. విరాట్‌ తదుపరి ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.

ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విరాట్‌ కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ స్పందించారు. భారత క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ ఒక చిరస్థాయిగా నిలిచే పేరు. అద్భుతమైన క్రికెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, అనేక రికార్డులు నెలకొల్పిన ఆటగాడిగా భారత దేశాన్ని గర్వపడేలా చేశారు. అతడి ఆటలోని క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సందర్భంలో, మిగతా ఫార్మాట్లలో కూడా మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

విరాట్‌ కోహ్లీ కెరీర్‌ అనేది కేవలం గణాంకాల పరిమితమైతే కాదు అది లక్షలాది అభిమానులకు స్పూర్తిగా నిలిచిన ప్రయాణం. టెస్టుల్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్‌ ఎన్నో చారిత్రక విజయాలు సాధించింది. ఇప్పుడే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డేలు మరియు టీ20ల్లో తన ప్రతిభను కొనసాగించనున్నాడు. అభిమానులు, మాజీ ఆటగాళ్లు, రాజకీయ నేతలు సహా దేశవ్యాప్తంగా పలువురు ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత క్రికెట్‌లో కోహ్లీ దశాబ్దకాలపు ప్రభావం ఓ చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోతుంది.

Read Also: Dalai Lama: ద‌లైలామా మెచ్చిన పుస్త‌కం.. విశేషాలీవే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • CM Revanth Reddy
  • Retirement from Test cricket
  • test cricket
  • virat kohli

Related News

Ajinkya Rahane

విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నారు.

  • Record Level Of National Hi

    ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు

  • Virat Kohli

    సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

  • IND Beat NZ

    టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

  • Virat Kohli

    చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

Latest News

  • మాజీ ఉపరాష్ట్రపతికి అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌!

  • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

  • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

  • మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?

  • మొహమ్మద్ రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం!

Trending News

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    • వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd