Y. S. Sharmila : ఎల్లుండి కాంగ్రెస్ లో చేరబోతున్న వైస్ షర్మిల
- By Sudheer Published Date - 12:13 PM, Tue - 2 January 24

వైస్ షర్మిల (Y. S. Sharmila) ఎల్లుండి (జనవరి 04) కాంగ్రెస్ (Congress) లో చేరబోతున్నారు. గత కొద్దీ రోజులుగా షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇక చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి లాంఛనంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు ఈరోజు ఇడుపులపాయలో కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగించబోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రయత్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సైతం చర్చలు జరిపారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వర్గం అడ్డుకోవడంతో షర్మిల పార్టీ విలీనానికి చివర్లో బ్రేక్ పడింది. అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. అప్పుడే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫిక్స్ గా అంత అనుకున్నారు. ఇక ఇప్పుడు అధికారికంగా చేరబోతున్నారు.
ఈ నెల 4న అంటే ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు. అనంతరం వరుసగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 4వ తేదీన ఢిల్లీ రావాలని షర్మిలకు ఆహ్వానం కూడా అందింది.
Read Also : Surya : సూర్య కోసం వెయిటింగ్ లిస్ట్ లో తెలుగు దర్శకులు..!