Nirmal : నిర్మల్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..పెళ్లికి నో చెప్పిందని గొడ్డలితో నరికి చంపాడు
- Author : Sudheer
Date : 08-02-2024 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధులు , ప్రేమోన్మాదులు ఏమాత్రం భయపడకుండా రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో యువతుల వెంట పడడం..కాదంటే చంపేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఎక్కడో చోట వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల (Nirmal) జిల్లాలో ఇదే జరిగింది. పెళ్లికి నిరాకరించిందని నడిరోడ్డు ఫై అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది.
We’re now on WhatsApp. Click to Join.
పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన అలేఖ్య (20)ను అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ (Srikanth) అనే యువకుడు టైలరింగ్ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆ దాడిని అడ్డుకోబోయిన యువతి వదిన, పక్కనే ఉన్న మరో రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నామని సీఐ మోహన్, ఎస్ఐ లింబాద్రి తెలిపారు.
Read Also : OTT Releases : రేపు OTT లో ఒకటి , రెండు కాదు 10 సినిమాలు వచ్చేస్తున్నాయి..