Kishan Reddy : ప్రధానిగా దేశానికి ఎవరు కావాలి?..మోడీనా?..రాహుల్ గాంధీనా..?: కీషన్ రెడ్డి ప్రశ్న
- By Latha Suma Published Date - 02:24 PM, Mon - 6 May 24

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) సందర్భంగా రాజకీయ పార్టీలో ప్రచారం(campaign)లో దూసుకుపోతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ(Prime Minister Modi)ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌కు రానున్నట్లు కేంద్రమంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్(Hyderabad) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో సాయంత్రం 4 గంటలకు మోడీ సభ ఉంటుందన్నారు. దేశం కోసం బీజేపీ రావాలి..మోడీ రావాలి నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాని కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ఆయన కోసం ప్రధాని కావాలని అనుకుంటున్నాడని తెలిపారు. మోడీ మోడీ అనే నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, సెక్రటేరియట్ లో ఉన్న రేవంత్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలన్నారు. 10వ తేదీన యువత అంత బైకులపైన స్టేడియంకు కదిలి రావాలన్నారు. తొలి ఓటర్లు అంత ఉదయాన్నే వెళ్లి ఓటెయ్యాలన్నారు. కుటుంబ సభ్యులు.. ఫ్రెండ్స్ తో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లాలని తెలిపారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు ఓటయ్యడానికి వెళ్తున్నామని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఓటేశాక.. మేము ఓటేశామని ఫోటో తీసి పెట్టి.. మీరంతా ఓటెయ్యండి అని క్యాప్షన్ పెట్టాలని పిలుపు నిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాని కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ఆయన కోసం ప్రధాని కావాలని అనుకుంటున్నాడని తెలిపారు. మోడీ మోడీ అనే నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, సెక్రటేరియట్ లో ఉన్న రేవంత్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలన్నారు. పదవ తేదీన యువత అంత బైకులపైన స్టేడియంకు కదిలి రావాలన్నారు. తొలి ఓటర్లు అంత ఉదయాన్నే వెళ్లి ఓటెయ్యాలన్నారు. కుటుంబ సభ్యులు.. ఫ్రెండ్స్ తో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లాలని తెలిపారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు ఓటయ్యడానికి వెళ్తున్నామని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఓటేశాక.. మేము ఓటేశామని ఫోటో తీసి పెట్టి.. మీరంతా ఓటెయ్యండి అని క్యాప్షన్ పెట్టాలని పిలుపు నిచ్చారు.