HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >What Was Done To The State During 11 Years Of Modi Rule Cm Revanth Reddy

Revanth Reddy : 11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు?: సీఎం రేవంత్ రెడ్డి

పెట్టుబడులతో పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ఏడాది కాలంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.

  • Author : Latha Suma Date : 24-02-2025 - 6:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
What was done to the state during 11 years of Modi rule?: CM Revanth Reddy
What was done to the state during 11 years of Modi rule?: CM Revanth Reddy

Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. 11 ఏళ్లలో మోడీకి రాష్ట్రానికి రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఒకటి కిషన్‌రెడ్డికి.. మరొకటి బండి సంజయ్‌కు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా? ఇన్ని వేలమందికి ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు ఎక్కడిది?. పెట్టుబడులతో పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ఏడాది కాలంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.

Read Also: KCR : ఫామ్ హౌస్లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు – సీఎం రేవంత్

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వారు సాధించిందేటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 55వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారు. ఆ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. గత పదేళ్లలో ఏనాడైనా కేసీఆర్ మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు.

మేము బీఆర్ఎస్ స్కామ్ ల మీద కేసులు పెడితే ఈడీ పేపర్లను లాక్కెళ్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఎజెండా ఏంటి అని ప్రశ్నించారు. వీళ్ల కుట్రలను ప్రజలు గమనించి.. మీ బిడ్డలను కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయించి గెలిపించాలని కోరారు. మా ప్రభుత్వం వచ్చాక మొత్తం 55,163 మందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామకపత్రాలు అందజేశాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు టెట్‌ నిర్వహించాం. 11 వేల మంది టీచర్ల నియామకం చేపట్టాం. పోలీసుశాఖలో 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6వేలకు పైగా పారామెడికల్‌ సిబ్బందిని నియమించాం. నేను చెప్పింది అబద్ధమైతే మాకు ఓటు వేయొద్దు. నిజమని నమ్మితే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించండి అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Read Also: PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • CM Revanth Reddy
  • Congress candidate Narendra Reddy
  • Mancherial
  • MLC election campaign
  • pm modi

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd