KCR : ఫామ్ హౌస్లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు – సీఎం రేవంత్
KCR : కేసీఆర్ ఫామ్ హౌసులో కూర్చుని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు
- By Sudheer Published Date - 06:01 PM, Mon - 24 February 25

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) చీకటి ఒప్పందం చేసుకుని బీజేపీకి మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign)లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్ ఫామ్ హౌసులో కూర్చుని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని గ్రాడ్యుయేట్లకు, టీచర్లకు ఇచ్చిన హామీలను నిర్వీర్యం చేసారని రేవంత్ ఆరోపించారు.
Katrina Kaif : మహాకుంభ మేళాలో కత్రినా కైఫ్.. స్వామీజీల నుంచి ఆశీస్సులు
“బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని , కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నేతల కోసం ఉద్యోగాలు వచ్చినా, తెలంగాణ ప్రజలకు అది దూరంగా మిగిలిపోయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 55వేలకు పైగా ఉద్యోగాలు అందించామని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రజా పథకాల గురించి వివరించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కాంగ్రెస్ అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Health Tips: ఈ ఒక్క పండు నీటిలో నానబెట్టి తింటే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా కరిగిపోవాల్సిందే!
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వంటి నేతలు ఎప్పుడైనా ప్రజలకు వాస్తవంగా సేవలు అందించారా అని ఈ సందర్బంగా ప్రశ్నించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యతను మేం తీసుకున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఏడాది తిరిగే లోపు రూ.2.25లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడైనా స్వయం సహాయక బృందాల గురించి పట్టించుకున్నారా..? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ అంటున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ రావులను దేశానికి రాకుండా కాపాడేది బండి సంజయ్ కాదా..? వాళ్లను రప్పిస్తే 48 గంట్లలో కేటీఆర్ ను జైలులో పెడతామనే కదా ప్రభాకర్ రావు, శ్రవన్ రావు రాకుండా కాపాడుతున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.