Telangana Voters; 3 కోట్లు దాటిన తెలంగాణ ఓటర్లు
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలవుతుంది. తెలంగాణాలో ఆ హడావుడి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి బయటకు పంపించేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది.
- By Praveen Aluthuru Published Date - 02:22 PM, Wed - 9 August 23

Telangana Voters; దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలవుతుంది. తెలంగాణాలో ఆ హడావుడి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి బయటకు పంపించేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఇన్నాళ్లు బీజేపీ ఆ బాధ్యత తీసుకున్నప్పటికీ అనివార్యకారణలో, అంతర్గత దోస్తీ కుదిరిందో కానీ ఒక్కసారిగా బీజేపీ సైలెంట్ అయిపోయింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ జీరోకి పడిపోయింది.
తెలంగాణాలో ఓటు సంఖ్య భారీగా పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల మంది ఓటర్ల మైలురాయిని తాకింది, మొత్తం 3 కోట్ల మంది ఓటర్లు మళ్లీ నమోదయ్యారు. గత ఐదేళ్ల కాలంలో 19 లక్షల మంది ఓటర్లు గణనీయంగా పెరిగారు. 2018 సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. అయితే జనవరి 2023 నాటికి ఎన్నికల సంఘం 2.99 కోట్ల మంది ఓటర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్ర ఓటర్లలో మహిళలు మరియు యువత గణనీయంగా పెరిగారు. వీళ్ళు మాత్రమే 71 శాతం ఉన్నారు. అంటే దాదాపుగా 2.12 కోట్ల మంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అదనపు అవకాశాన్ని కల్పిస్తోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 19 వరకు ఓటర్ల జాబితాల్లో పేర్లను చేర్చే ప్రక్రియను చేపట్టనున్నారు. దీని తర్వాత సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. చివరగా అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు.
Also Read: Punganur Violence: బెయిల్ ప్రయత్నాల్లో దేవినేని ఉమా