Viral Flexi: వైరల్.. ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య
ఇకపోతే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 12:45 PM, Tue - 14 January 25

Viral Flexi: సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బాలకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Flexi) అవుతోంది. అయితే వైరల్ అవుతున్న ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య పేర్ల కింద కొన్ని క్యాప్షన్ ఇచ్చారు. అవి కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు పేరు కింద బాస్ ఈజ్ బ్యాక్ అని రాసి ఉంది. కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. బాలకృష్ణ ఫొటో కింద డాకు మహారాజ్ అని రాశారు. అయితే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతోనే చంద్రబాబు పేరు కింద బాస్ ఈజ్ బ్యాక్ అని పెట్టినట్లు సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
బాలకృష్ణ కింద డాకు మహారాజ్ అని ఉండటంతో దీనిపై కూడా రకరకాల కామెంట్లు పెట్టారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన బాలకృష్ణ తన మూవీ డాకు మహారాజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అందుకే బాలకృష్ణ పేరు కింద డాకు మహారాజ్ అని రాశారని అంటున్నారు.
Also Read: 100 Medals Returned : ప్యారిస్ ఒలింపిక్స్ ప్రమాణాలు పతనం.. 100 పతకాలు వాపస్.. ఎందుకు?
ఇకపోతే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఈ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాసినట్లు చెబుతున్నారు.
ఏదీ ఏమైనా ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది ఆయా నాయకుల మీద అభిమానంతో ఏర్పాటు చేశారా? లేక కావాలనే ఏర్పాటు చేశారా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో కేసీఆర్ అభిమాని, ఏపీలో చంద్రబాబు, సినిమాల్లో బాలకృష్ణ ఫ్యాన్ కావడంతోనే ఈ విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉంటారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.