Vande Bharat Express: వందేభారత్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఎద్దును ఢీకొన్న ట్రైన్
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు (Vande Bharat Express) తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని చోట్ల కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేస్తే.. మరికొన్ని చోట్ల గేదెలు రైలును ఢీ కొట్టడంతో.. రైలు ముందు భాగాలు దెబ్బతిన్నాయి.
- Author : Gopichand
Date : 12-03-2023 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు (Vande Bharat Express) తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని చోట్ల కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేస్తే.. మరికొన్ని చోట్ల గేదెలు రైలును ఢీ కొట్టడంతో.. రైలు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరగగా.. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ ప్రమాదం జరిగింది. వందే భారత్ రైలు ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును అక్కడికక్కడే నిలిపివేసి మరమ్మతులు చేశారు.
శనివారం (మార్చి 11) మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ వద్దకు రాగానే ట్రాక్‌పైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలు బయలుదేరిందని అధికారులు వెల్లడించారు.
Also Read: 900 Tourists: మంచులో చిక్కుకున్న 900 మంది యాత్రికులు.. ఎక్కడంటే..?
గతేడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వందేభారత్ రైలు గేదెలను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజన్ ముందు భాగం ధ్వంసమైంది. రైలుకు అడ్డంగా వచ్చిన నాలుగు గేదెలు మృతి చెందాయి. మరుసటి రోజు ఆనంద్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వందే భారత్ రైలు ఇంజన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది.