VH : టిక్కెట్ విషయంలో నాకు అన్యాయం జరిగింది: వీహెచ్
- By Latha Suma Published Date - 03:38 PM, Wed - 10 July 24

V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..గడిచిన ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని..రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి ధన్యవాదాలు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలిపారు. మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలో క్రికెట్‌కు మంచి క్రేజ్ ఉందన్నారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. కానీ ఏపీలో 12 ఉన్నాయని వెల్లడించారు.
Read Also: Balcony Rent : బాల్కనీ రెంటు నెలకు రూ.81వేలు.. ఎక్కడో తెలుసా ?
గతంలో కేటీఆర్(KTR) క్రీడలను ప్రోత్సహించలేదని ..కనీసం ఎకరం భూమిని కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడాలకు ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించాలని వీహెచ్ కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి పన్నెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు.
Read Also: Rythu Bharosa: రైతు భరోసా హామీకి కాంగ్రెస్ సిద్ధం: భట్టి విక్రమార్క