HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Us President Donald Trumps Sons Will Visit Hyderabad Soon This Is The Reason

Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే

హైదరాబాద్‌(Trump Tower Hyderabad) మహా నగరంపై ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీల ఫోకస్ ఉంది.

  • Author : Pasha Date : 22-01-2025 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trump Tower Hyderabad Us President Donald Trumps Sons In India

Trump Tower Hyderabad : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. దీంతో ఆయన కుటుంబం మళ్లీ యాక్టివేట్ అయింది. అమెరికా అంటేనే అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలపై దానికి ఎంతో కొంత పట్టు ఉండబట్టే అగ్రరాజ్యం అనే పేరు వచ్చింది. అందుకే డొనాల్డ్ ట్రంప్ కుమారులు రంగంలోకి దూకారు. తమ వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంపై ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే వారు త్వరలోనే మన హైదరాబాద్‌కు కూడా వస్తారని తెలిసింది. ట్రంప్ టవర్స్‌ను హైదరాబాద్‌లో కూడా నిర్మించాలనే ప్లాన్‌తో వాళ్లు ఉన్నారట. ఇందుకోసం మన భాగ్యనగరంలోని లగ్జరీ, కాస్ట్లీ లొకేషన్‌లో స్థలాన్ని కొనబోతున్నారట. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన  ట్రంప్ టవర్స్ అనేది లగ్జరీ అపార్ట్‌మెంట్లను, హోటళ్లను నిర్మిస్తుంటుంది.  మనదేశంలోని ముంబై, పూణె, కోల్‌కతా, గుర్గావ్‌లలో ఇప్పటికే 4 ట్రంప్ టవర్లు ఉన్నాయి. 2030 నాటికి భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్యను 10కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్,  ముంబై, గుర్గావ్, పూణె, నోయిడా, బెంగళూరులలో కొత్త ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. ఈ నూతన నిర్మాణ ప్రాజెక్టుల పనులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు త్వరలో స్వయంగా ప్రారంభిస్తారట.

Also Read :Megha : మేఘా, స్కైరూట్‌, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ

హైదరాబాద్‌ను ఎందుకు ఎంచుకున్నారు ?

హైదరాబాద్‌(Trump Tower Hyderabad) మహా నగరంపై ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీల ఫోకస్ ఉంది. ఈక్రమంలోనే ట్రంప్ టవర్స్ కూడా ఇక్కడ తమ టవర్‌ను నిర్మించబోతోంది. ఇందుకోసం భారీగా నిధులను వెచ్చించబోతోంది. లగ్జరీ హోటళ్లు, అపార్ట్‌మెంట్లకు హైదరాబాద్‌లో రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇదంతా తెలుసుకున్నాకే.. హైదరాబాద్‌లోనూ ట్రంప్ టవర్ ఏర్పాటు దిశగా డొనాల్డ్ ట్రంప్ కుమారులు నిర్ణయం తీసుకున్నారట. గూగుల్, ఫేస్‌బుక్ నుంచి మొదలుకొని ఎన్నో ప్రముఖ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇతరత్రా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగింది. ఈ పరిణామాలు తమ వ్యాపారానికి కూడా కలిసొస్తాయనే ఆశాభావంతో ట్రంప్ కుమారులు ఉన్నారు. తాము నిర్మించే లగ్జరీ నివాసాలు ఈజీగా సేల్ అవుతాయనే అంచనాలతో వారు ఉన్నారు.

Also Read :Congress Schemes: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి విక్రమార్క

ట్రంప్ టవర్లలో ఇళ్ల రేట్లు ఇలా.. 

  • మనదేశంలో ఇప్పటికే నాలుగు ట్రంప్ టవర్లు ఉన్నాయి. వాటిలో 800 లగ్జరీ నివాసాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.7,500 కోట్లు.
  • గురుగ్రామ్‌లో ఉన్న ట్రంప్ టవర్‌లో ఒక్కో ఇంటిని దాదాపు రూ.12 కోట్ల నుంచి రూ.24 కోట్ల రేటుకు విక్రయిస్తుంటారు.
  • కోల్‌కతాలో ఉన్న ట్రంప్ టవర్‌లో ఒక్కో ఇంటిని దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్లకు విక్రయిస్తుంటారు.
  • ముంబై, పూణే నగరాల్లోనూ ట్రంప్ టవర్లు ఉన్నాయి. వాటిలోని ఇళ్లను సగటున  రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా రేట్లకు అమ్ముతుంటారు.
  • రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్,  ముంబై, గుర్గావ్, పూణె, నోయిడా, బెంగళూరులలో ఆరు ట్రంప్ టవర్ల నిర్మాణం పూర్తవుతుంది. అదే జరిగితే భారత్‌లో ట్రంప్ టవర్ల మొత్తం విలువ రూ.15వేల కోట్లకు చేరుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • hyderabad
  • Trump Tower Hyderabad
  • Trump Towers
  • Trump Towers In India
  • Trumps Sons
  • us president

Related News

Indiramma Housing Scheme 2n

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకనే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. మెుత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

  • Us Iran Attack

    ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Hyd Parking

    Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

  • Fire in Meerut

    HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !

Latest News

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

  • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd