HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Union Minister Rajnath Singh Criticizes Cm Kcr And Brs Government

Bjp Janagarjana Sabha: తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కడే కాదు

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అధికార కుర్చీ కోసం మూడు పార్టీలు కాచుకుని కూర్చున్నాయి. తన కుర్చీని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 6 హామీలంటూ తెరపైకి వచ్చింది

  • Author : Vamsi Chowdary Korata Date : 16-10-2023 - 3:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp Janagarjana Sabha
Bjp Janagarjana Sabha

Bjp Janagarjana Sabha: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అధికార కుర్చీ కోసం మూడు పార్టీలు కాచుకుని కూర్చున్నాయి. తన కుర్చీని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 6 హామీలంటూ తెరపైకి వచ్చింది. ఇక బీజేపీ కెసిఆర్ ని గద్దె దించేందుకు సన్నాహక రాజకీయాలకు కాలు దువ్వుతుంది. దీంతో దేశ రాజకీయాలందు తెలంగాణ రాజకీయాలు వేరయా అన్న చందంగా మారింది.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే వ్యూహాలతో బీజేపీ అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. కేంద్రం అమలుచేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన నిధుల లెక్కలను బహిర్గతం చేస్తూ ఓటు బ్యాంకును సాధించుకునేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదని బీజేపీ కూడా పోరాడిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లోని జమ్మికుంటలో బీజేపీ జన గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు సంధించారు. రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతం కోసం రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది పోరాడారని కేంద్ర మంత్రి చెప్పారు.

గుజరాత్‌లో బీజేపీ రెండున్నర దశాబ్దాలకు అధికారంలో ఉందని అయన అన్నారు. దేశంలో గుజరాత్ అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. అయితే పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి కాలేదో కేసీఆర్ చెప్పాలని మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని, ఇదో ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ఎద్దేవా చేశారు.

Also Read: TCongress: అధికారమే లక్ష్యంగా రాహుల్, ప్రియాంక ప్రచార పర్వం, విజయ భేరి పాదయాత్రతో శ్రీకారం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • Janagarjana Sabha
  • kcr
  • Minister Rajnath Singh
  • telangana

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గతంలో విడివిడిగా జరుగుతున్న కొనుగోళ్ల వల్ల జవాబుదారీతనం లోపించిందని గుర్తించిన ప్రభుత్వం, ఇకపై ఒకే గొడుగు కింద పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది

  • CV Anand Assumes Charge as Telangana DGP

    CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

  • KTR clarifies on organizations formed in his name

    KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

Latest News

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

  • Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

  • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

  • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd