Telangana: స్కాం బీఆర్ఎస్, తప్పుడు హామీలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు
- By Praveen Aluthuru Published Date - 03:33 PM, Wed - 21 February 24
Telangana: కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు. 2014లో ప్రజలు మోదీని అధికారంలోకి తీసుకొచ్చారు. 53 కోట్ల బ్యాంకు ఖాతాలు, ఎల్‌పీజీ సిలిండర్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, గృహనిర్మాణం, పైపుల ద్వారా తాగునీరు వంటి పథకాలతో అభివృద్ధి చేశారని వర్మ తెలిపారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రజలకు దూరం చేసిందని ఆయన ఆరోపించారు. ‘తప్పుడు’ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు రాజస్థాన్‌లో కూడా అదే గతి పడుతుందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి మోదీ అవసరమని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి సెలవు తీసుకోకుండా పనిచేసిన మోదీని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులను మంత్రి కోరారు. మోదీని గెలిపించేందుకు రాబోయే 100 రోజుల సమయం ఇవ్వండి. మీ బూత్‌ను గెలిపించి నియోజకవర్గాన్ని గెలిపించడమే మంత్రంగా పెట్టుకోవాలని అన్నారు.
Also Read: Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?