Ban The Toddy : తెలంగాణ లో కల్లును బ్యాన్ చేయాలనీ ప్రభుత్వం చూస్తుందా..?
Ban The Toddy : హైదరాబాద్ GHMC పరిధిలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌లో లైసెన్స్ లేని కల్లు కేంద్రాన్ని మూసివేశారు
- Author : Sudheer
Date : 12-07-2025 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ జీవన విధానంలో కల్లు (Toddy) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పల్లె జీవనశైలిలో రోజు ప్రారంభం కల్లు తాగడం తోనే కొంతమంది చేస్తుంటారు. తాటి చెట్ల నుంచి వచ్చే కల్లు ఆరోగ్యానికి మంచిదని నమ్మకం కూడా ఉంది. ఇదే సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో కూడా మన తాటి కల్లును పరిచయం చేశారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పానీయం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. గతంలో కల్లు కోసం ప్రత్యేక కేప్‌లు పెట్టి ప్రోత్సహించిన రాష్ట్రం, ఇప్పుడు దాన్ని నిషేధించాలా అనే స్థితికి వచ్చింది.
ఇటీవల కూకట్‌పల్లి ఘటన తెలంగాణ(Telangana)ను షేక్ చేసింది. కల్తీ కల్లు (Adulterated Toddy) తాగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. కల్లు పేరిట కెమికల్ మిశ్రమాలు అమ్ముతూ నిర్భందంగా మునుగుతున్న ఈ వ్యవస్థను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వచ్ఛతతో ఉండాల్సిన తాటి కల్లు, లాభాల ఆశతో కల్తీగా మర్చి, ప్రాణాల మీదకు తెస్తున్నారు.
Perni Nani Rappa Rappa Comments : దూల తీరింది..పేర్ని నానిపై కేసు
దీని ప్రభావంతో ఎక్సైజ్ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కల్లు కాంపౌండ్‌లపై దాడులు చేస్తున్నారు. అనుమతులు లేని కాంపౌండ్‌లను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ GHMC పరిధిలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌లో లైసెన్స్ లేని కల్లు కేంద్రాన్ని మూసివేశారు. అయినా, నగరాల్లో మాత్రమే కాకుండా పల్లెప్రాంతాల్లోనూ ఇదే దృశ్యం కనబడుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పలు సామాజిక సంఘాలు కల్లును పూర్తిగా నిషేధించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇది తప్పనిసరి చర్య అని వాదిస్తున్నారు. ప్రభుత్వం సైతం కల్లు సెంటర్ లను బ్యాన్ చేయాలనే నిర్ణయం తో ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా బ్యాన్ చేస్తుందా..? లేక ఏమైనా కఠిన ఆంక్షలు విధిస్తుందా..? అనేది చూడాలి.