HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >This Is An Accident Cm Revanths Review Of The Tunnel Accident

CM Revanth: ఇది అనుకొని ప్ర‌మాదం.. ట‌న్నెల్ ప్ర‌మాదంపై సీఎం రేవంత్ స‌మీక్ష‌!

ఇంకా మాట్లాడుతూ.. పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని మేం చిత్తశుద్దితో పనిచేస్తుంటే.. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది.

  • Author : Gopichand Date : 02-03-2025 - 10:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఎనిమిది ప్రాణాలు గల్లంతు కావడం ఆవేదన కలిగించే విషయమ‌ని అన్నారు. గత నిర్లక్ష్యాల గాయాలు ఇవి అని, పదేళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ పట్ల నిర్లక్ష్యానికి మూల్యం ఇద‌ని.. అయినా మా సంకల్పం చెక్కు చెదరదని సీఎం స్ప‌ష్టం చేశారు. నల్గొండకు నీళ్లుచ్చే వరప్రదాయని ఈ టన్నెల్.. ఈ విపత్తు తాత్కాలికం, కృష్ణా నీళ్లు మన బీళ్లకు పారించడం మా సంకల్పమ‌ని పేర్కొన్నారు.

ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప‌రిశీల‌న త‌ర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం SLBC టన్నెల్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించింది. టన్నెల్ పనులు చేసే సంస్థకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పైగా ఆ సంస్థ విద్యుత్ బకాయిలు చెల్లించలేదని విద్యుత్ నిలిపివేశారు. విద్యుత్ లేకపోవడంతో టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. సంస్థకు బిల్లులు చెల్లించి, సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యలు పరిష్కరించాం. మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ అమెరికా నుంచి తెప్పించామ‌ని ఆయ‌న అన్నారు.

Also Read: India vs New Zealand: టీమిండియా ఘ‌న విజ‌యం.. సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ!

ఇంకా మాట్లాడుతూ.. పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని మేం చిత్తశుద్దితో పనిచేస్తుంటే.. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది. ఇది అనుకొని ప్రమాదం. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలి. ఆర్మీ, టన్నెల్ ఎక్స్పర్స్ట్స్ తో సహా 11 డిపార్ట్మెంట్స్ సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదు. ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారింది. రేపటిలోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుంది. ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో, ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశామ‌న్నారు.

ఇది ఒక విపత్తు.. మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వలేదు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తే నన్ను జైల్లో పెట్టారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఎక్కడ మరణించినా ఆనాడు ప్రభుత్వం విపక్షాలను అనుమతివ్వలేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడకు వెళ్ళలేదు. కానీ ఇవాళ మేం ఘటన జరిగిన వెంటనే ఉత్తమ్ ని పంపి, కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థలను ఇక్కడికి రప్పించాం. ప్ర‌పంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇదిజ‌ మేం మనోధైర్యం కోల్పోలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నా అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • revanth reddy
  • SLBC Tunnel
  • telangana
  • telugu news
  • Tunnel Accident
  • Tunnel Incident

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Kalvakuntla Kavitha

    Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd