EC : తెలంగాణ లో ఈసీ రద్దు చేసిన 13 పార్టీలు ఇవే !
EC : "ఎందుకు మీ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయకూడదు?" అనే ప్రశ్నతో జులై 11లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
- By Sudheer Published Date - 04:09 PM, Mon - 7 July 25

తెలంగాణ రాష్ట్రంలో 13 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందడుగు వేసింది. ఈ పార్టీలపై గత ఆరు సంవత్సరాలుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పాల్గొనకపోవడం, కార్యకలాపాల్లో కనిపించకపోవడాన్ని కారణంగా చూపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. “ఎందుకు మీ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయకూడదు?” అనే ప్రశ్నతో జులై 11లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నోటీసులు అందుకున్న పార్టీలలో తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ (హనుమకొండ), ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ (హైదరాబాద్), జాగో పార్టీ (హైదరాబాద్), నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (హైదరాబాద్), తెలంగాణ లోక్‌సత్తా పార్టీ (హైదరాబాద్), తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం (హైదరాబాద్), యువ పార్టీ (హైదరాబాద్), బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) (మేడ్చల్-మల్కాజ్‌గిరి), తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ (మేడ్చల్-మల్కాజ్‌గిరి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ (రంగారెడ్డి), జాతియా మహిళా పార్టీ (రంగారెడ్డి), యువ తెలంగాణ పార్టీ (రంగారెడ్డి), తెలంగాణ ప్రజా సమితి (వరంగల్) లు ఉన్నాయి.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా రాజకీయ పార్టీ రెండు వరుస సాధారణ ఎన్నికలలో లేదా ఆరు సంవత్సరాల కాలంలో ఏ ఎన్నికలోనైనా పాల్గొనకపోతే, ఆ పార్టీకి క్రియాశీలత లేదన్న భావన ఏర్పడుతుంది. అదేకాక, ఆ పార్టీలు తమ కార్యాలయ చిరునామా మారిందని తెలియచేయకపోతే, వార్షిక నివేదికలు, ఖర్చుల వివరాలు సమర్పించకపోతే కూడా పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ 13 పార్టీల పరిస్థితి కూడా అంతే.
Kingdom : ‘రౌడీ’ ఫ్యాన్స్ రావాలమ్మ.. ఈరోజే రిలీజ్ డేట్ పై క్లారిటీ..!
ఒకసారి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దయితే, ఆ పార్టీకి ప్రత్యేక గుర్తు లభించదు. పలు నియోజకవర్గాల్లో ఒకే గుర్తుతో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసుకునే హక్కు ఉండదు. అభ్యర్థులకు నామినేషన్ సమయంలో అధిక సంఖ్యలో ప్రతిపాదకులు అవసరం అవుతారు. పార్టీ బైలాస్ ఉల్లంఘనలు, నిధుల పారదర్శకత లోపించడంతో పాటు, ఎన్నికల నిబంధనలను పాటించకపోవడం కూడా గుర్తింపు రద్దుకు దారితీస్తుంది. జులై 15న ఈ 13 పార్టీల భవితవ్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించనుంది.