Kingdom : ‘రౌడీ’ ఫ్యాన్స్ రావాలమ్మ.. ఈరోజే రిలీజ్ డేట్ పై క్లారిటీ..!
Kingdom : టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది.
- By Kavya Krishna Published Date - 02:43 PM, Mon - 7 July 25

Kingdom : టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. విజయ్ తన కెరీర్‌లో చాలా వరకు స్టైలిష్, మాస్, యూత్ ఫుల్ పాత్రల్లో కనిపించినప్పటికీ, ఈ సినిమాతో అతను పూర్తి స్థాయిలో ఇంటెన్స్ యాక్షన్ పాత్రలోకి మారుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, పోస్టర్లు, గ్లింప్సెస్ అన్నీ కూడా విజయ్ అభిమానులను మాత్రమే కాకుండా, సినిమాపై ఆసక్తి ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమాలో ఆయన భిన్నమైన బాడీ లాంగ్వేజ్, తీవ్రమైన హావభావాలు, కొత్త గెటప్ చూసి ఫ్యాన్స్ “ఇది విజయ్ దేవరకొండేనా?” అని అంటున్నారు. ఇందుకోసం విజయ్ తాను గణనీయమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది.
అయితే.. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గత కొంత కాలంగా ఈ చిత్రం విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్స్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.
అయితే.. ఇప్పుడు అభిమానులందరినీ హృదయపూర్వకంగా ఆనందింపజేసేలా మేకర్స్ ఒక కీలక అప్డేట్ ప్రకటించారు. ఈ చిత్రం రిలీజ్ డేట్‌కు సంబంధించి స్పెషల్ ప్రోమోను ఈరోజు సాయంత్రం 7:03 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. దీంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియాలని ఎదురు చూస్తున్న వారిలో ఉత్సాహం పెరిగింది.
సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మూవీపై భారీ హైప్ ఉంది. విజయ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అందుకోకపోయినా, ఈ సినిమా మాత్రం తిరుగులేని హిట్ అవుతుందని విశ్వసిస్తున్నారు. సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం కావడం, విజయ్ దేవరకొండ యాక్టింగ్‌లో సీరియస్ ఛేంజ్ రావడం.. అన్నీ కలిస్తే ‘కింగ్డమ్’ ఓ బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనాలు పెరిగిపోతున్నాయి.
మొత్తానికి, ‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండ కెరీర్‌ను మరో మలుపు తిప్పే చిత్రంగా మారనుందని ఇండస్ట్రీలో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే.. వరుస పరాజయాలతో ఉన్న విజయ్ ఆశలు అన్నీ దీనిపై ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి రౌడీ స్టార్ నిజంగానే బ్లాక్‌బస్టర్‌తో బౌన్స్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్న ఆసక్తి రౌడీ బాయ్ విజయ్ ఫాన్స్ లో నెలకొంది. అయితే.. విడుదల తేదీ దగ్గరికి వచ్చేవరకు వేచి చూడాల్సిందే విజయ్ మేనియా ఏ రేంజ్ లో ఉంటుందో.. ఈ సినిమా విజయ్ కు విజయాన్ని చేకూరుస్తుందో చూడాలి మరి..!
APNews : క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు