HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Line Is Clear For 14 New Excise Police Stations

Excise Police Stations: 14 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు లైన్‌ క్లియర్‌!

పాత ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలే కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Author : Gopi Date : 27-03-2025 - 4:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Excise Minister
Excise Minister
  • ఏప్రిల్‌ 1 నుంచి విధుల నిర్వహణకు ఆదేశాలు
  • హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు
  • వరంగల్‌ అర్బన్‌లో ఒక ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌
  • కొత్త స్టేషన్లకు ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓలు ఇంచార్జీలుగా కొనసాగింపు

Excise Police Stations: తెలంగాణలో ఏప్రిల్‌ 1 నుంచి 14 ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు (Excise Police Stations) ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 14 ఎక్సైజ్‌ పోలీస్ స్టేష‌న్ల‌లో 13 ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు హైదరాబాద్‌లోను, ఒక ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరంగల్‌ అర్బన్‌లో ఏర్పాటు కానున్నాయి. 2020లో 14 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి. కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల విభజన, ప్రాంతాల బదలాయింపు కార్యక్రమాల్ని పూర్తి అయ్యాయి.

కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆదేశాలు

ప్రభుత్వ అనుమతులు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్‌ సెకట్రరీ రిస్వి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చెవ్వూరు హరి కిరణ్‌లు కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు అమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ అజయ్‌రావు కొత్త పోలీస్‌ స్టేషన్లను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులను జారీ చేశారు.

అద్దె భవనాలు గుర్తించిన కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఇవే

కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు అద్దె భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లకు బంజారా హిల్స్, చిక్క‌డ‌ప‌ల్లి, గండిపేట్‌, కొండపూర్‌, పెద్ద అంబ ర్‌పేట్‌, కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌, హసన్‌పర్తి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు అద్దె భవనాల గుర్తింపు జరిగింది. ఏప్రిల్‌ ఒకటో తేదీన కొత్త భవనాల్లో కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభంకానున్నాయి.

Also Read: KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్‌

అద్దె భవనాలు లభించని మారేడ్‌పల్లి, మీర్‌పేట్‌, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్‌ కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రస్తుతం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లుగా నడుస్తున్న సికింద్రాబాద్‌, సరూర్‌నగర్‌, కుత్భుల్లాపూర్‌, ఘట్కేసర్, ఉప్పల్‌, మల్కాజి గిరి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక గదుల్లో కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.

ఇంచార్జులుగా పాత స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు

పాత ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలే కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీలు కాకపోతే సీనియర్‌ ఎక్సైజ్‌ ఎస్సైలకు ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించడానికి అవకాశాలు ఇవ్వనున్నారు.

స్టేషన్లతో పాటు కేసులు, స్వాధీన సోత్తు బదులాయింపు

కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించిన కేసుల రికార్డులు, స్వాధీనం కాబడిన గంజాయి, డ్రగ్స్‌, వాహనాలు, బెల్లం, ఎన్‌డీపీల్‌ మద్యం బాటిళ్లను కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిల్వ చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • Excise Police Stations
  • Excise Polices
  • Minister Jupally
  • telangana
  • Warangal Urban

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd