Telangana Land Prices : తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. ఎంత ?
రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్(Telangana Land Prices) ధర సగటున రూ.3200 ఉంది. దీన్ని 60 శాతం వరకు పెంచుతారట. అంటే చదరపు అడుగు ధర రూ.5120 వరకు అవుతుంది.
- Author : Pasha
Date : 29-01-2025 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Land Prices : ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో ఏం జరగబోతోంది ? భూముల ధరలు పెరుగుతాయా ? అంటే.. ఔను అనే సమాధానమే వినిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Peddireddy Agricultural Field : మంగళంపేట అడవిలో పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం.. సర్వత్రా చర్చ!
ఇక లాంఛనమేనా ?
ప్రస్తుతం తెలంగాణలో భూముల ధర బహిరంగ మార్కెట్‌లో చాలా ఎక్కువగా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం చాలా తక్కువగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల 100 శాతం నుంచి 400 శాతం దాకా భూముల విలువను సర్కారు పెంచుతుందనే టాక్ వినిపిస్తోంది. ఫ్లాట్ల ధరలను వివిధ ప్రాంతాల్లో 15-30 శాతం దాకా, స్థలాల విలువను ఒకటి నుంచి నాలుగు రెట్లు వరకు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా భూములకు సంబంధించి సవరించిన కొత్త మార్కెట్ విలువలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం ఇక లాంఛనమే అని చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఆరేళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. దీనివల్ల తెలంగాణలోని రియల్‌ఎస్టేట్ రంగం దెబ్బతినే ముప్పు ఉంటుంది.
Also Read :Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లూ ట్యాప్
కీలక మార్పులు ఇవేనా ?
- రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్(Telangana Land Prices) ధర సగటున రూ.3200 ఉంది. దీన్ని 60 శాతం వరకు పెంచుతారట. అంటే చదరపు అడుగు ధర రూ.5120 వరకు అవుతుంది.
- హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర రూ.26700గా ఉంది. ఇదే వాణిజ్య స్థలమైతే గజం రూ.44900 ఉంది.
- మహేశ్వరం లాంటి చోట్ల గజం ధర రూ.2100 ఉండగా, అక్కడ 400 శాతం దాకా రేట్లు యోచనలో ప్రభుత్వం ఉంది. రూ.3 వేల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను పెంచనున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో..
2023-24 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో 35.1 శాతం(రూ.5,115 కోట్లు) ఫ్లాట్ల నుంచే వస్తోంది. ప్లాట్ల నుంచి 22.8 శాతం (రూ.3322 కోట్లు) వస్తోంది. ఇళ్ల రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5 శాతం (రూ.2838 కోట్లు) వస్తోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల నుంచి 11.4 శాతం (రూ.1668 కోట్లు) వస్తోంది.