HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Discussion About Former Minister Peddireddy Ramachandra Reddys Agricultural Field In The Forest Near Mangalampet Of Chittoor District

Peddireddy Agricultural Field : మంగళంపేట అడవిలో పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం.. సర్వత్రా చర్చ!

ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా చాలా రకాల అనుమతులను(Peddireddy Agricultural Field) పొందాలి.

  • By Pasha Published Date - 09:25 AM, Wed - 29 January 25
  • daily-hunt
Peddireddy Ramachandra Reddy Agricultural Field Mangalampet Forest Chittoor District Min

Peddireddy Agricultural Field : మాజీ అటవీశాఖ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో ప్రస్తుతం నంబర్ 2 స్థాయి కలిగిన కీలక నేత. ఈయనపై మీడియాలో ఒక సంచలన కథనం వచ్చింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం సమీపంలోని అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న వ్యవసాయక్షేత్రం గురించి ఆ కథనంలో ప్రస్తావించారు. దాని ప్రకారం.. మంగళంపేట శివార్లలోని అడవిలో 295 సర్వే నంబరులో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబరులో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్‌ అడంగల్, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)లో నమోదు చేశారు. దానికి సరిహద్దుల్లో రిజర్వ్ ఫారెస్ట్‌ ఉందని 1952లో చేసిన సర్వే ప్రకారం రికార్డులను రూపొందించారు. వీటి ప్రకారం ఆ రెండు సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 23.69 ఎకరాల ల్యాండ్ ఉంది.

Also Read :Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లూ ట్యాప్

2000, 2001 సంవత్సరాల్లో

  • అవే సర్వే నంబర్లలో (తర్వాత సబ్‌డివిజన్‌ చేశారు) పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మల పేరిట 2000, 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్‌రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములురెడ్డి, మంగమ్మల నుంచి వారు ఆ భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఉంది.
  • రెవెన్యూ రికార్డుల్లో (అడంగల్‌)లో 295/1ఎ, 295/1బి, 295/1సి, 295/1డి, 296/1, 296/1బి సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరిట 75.75 ఎకరాల భూమి ఉన్నట్టు నమోదైంది.

Also Read :ISRO : ఇస్రో వందో ప్రయోగం సక్సెస్.. దీని ప్రత్యేకత ఏమిటి ?

ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా చాలా రకాల అనుమతులను(Peddireddy Agricultural Field) పొందాలి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులను తీసుకోవాలి. కానీ పెద్దిరెడ్డి అడవి మధ్యలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోగలిగారు. అక్కడే విలాసవంతమైన భవనం కట్టుకోగలిగారు. పెద్దిరెడ్డి అప్పట్లో అటవీశాఖ మంత్రిగా ఉండటంతో రొంపిచెర్ల మార్కెట్‌ కమిటీ నిధులతో అడవి మధ్యలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వరకు తారు రోడ్డు వేయించుకున్నారు.  ఈ వ్యవసాయ క్షేత్రం చుట్టూ 15-20 అడుగుల ఎత్తులో కంచె వేసుకున్నారు. రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగే చోట ఇనుపకంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. దీంతో అవి అటవీ ప్రాంతాన్ని అనుకుని ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలు నాశనం చేస్తున్నాయి. ఈమేరకు వివరాలతో ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chittoor district
  • Mangalampet
  • Mangalampet Forest
  • Peddireddy Agricultural Field
  • peddireddy ramachandra reddy

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd