HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Biggest Mega Job Mela In Huzurnagar Minister Uttam Will Review The Arrangements

Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్!

ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌ని కోరారు.

  • By Gopichand Published Date - 03:11 PM, Tue - 21 October 25
  • daily-hunt
Mega Job Mela
Mega Job Mela

Mega Job Mela: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హుజూర్‌నగర్‌లో ఈ నెల అక్టోబర్ 25న రాష్ట్రంలోనే అతిపెద్ద మెగా జాబ్ మేళా (Mega Job Mela)ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హుజూర్‌నగర్ వేదిక వద్ద ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, పరిశ్రమల కమిషనర్ కూడా పాల్గొన‌నున్నారు.

భారీగా కంపెనీలు

రానున్న జాబ్ మేళాలో సుమారు 200 కంపెనీలు పాల్గొంటాయాని, దాదాపు 12,000- 13,000 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరవుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇటీవ‌ల మంత్రి మాట్లాడుతూ.. యువతకు వారి సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Chiranjeevi Diwali Celebrations : మెగా సంబరాలకు బాలయ్యకు ఆహ్వానం అందలేదా..?

ఏర్పాట్లపై సమీక్ష

సమీక్షా సమావేశంలో ప్రధానంగా టెంట్ హౌస్‌ల ఏర్పాటు, నిరుద్యోగుల కోసం అల్పాహారం, భోజన సదుపాయాలు, వేదిక వద్ద ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించ‌నున్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి మరింత మందికి తెలిసేలా హోర్డింగ్‌ల ఏర్పాటు, వార్తాపత్రికలలో కరపత్రాల ముద్రణ, విస్తృత ప్రచారం వంటి విషయాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయ‌నున్నారు.

ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌ని కోరారు. ఈ మెగా జాబ్ మేళా సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళా విజయవంతం అయ్యేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Huzurnagar
  • Mega Job Mela
  • minister uttam
  • telangana
  • telugu news

Related News

Minister Lokesh

Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

  • Mega Job Mela

    Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

  • Sadar Sammelan

    Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh

    Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman

    TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

Latest News

  • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

  • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

  • Diwali Effect : దీపావళి ఎఫెక్ట్ కిక్కిరిసిన రైళ్లు..ప్రయాణికుల గగ్గోలు

  • Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్‌.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌!

  • Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్!

Trending News

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd