Venuswami : వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
నాగ చైతన్య, శోభిత దూళిపాళ నిశ్చితార్థం అనంతరం వేణుస్వామి.. వారి భవిష్యత్ వివాహ బంధంపై జాతకం చెప్తూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
- By Latha Suma Published Date - 05:47 PM, Tue - 13 August 24

Venuswami: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్(Telangana Women Commission) నోటీసులు ఇచ్చింది. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వీడియోపై ఆయనకు కమిషన్ నోటీసులు పంపింది. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు విడిపోతారు అంటూ చేసిన కామెంట్ల మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో కూడా వేణుస్వామి సినిమా రిలీజ్ ల గురించి, రాజకీయ ఫలితాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి అవాస పాలైన బుద్ధి రాలేదని ఇప్పుడు నాగచైతన్య శోభిత వ్యక్తిగత వ్యవహారాలను రోడ్డుకి ఈడుస్తూ చేసిన వీడియో గురించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే తాజాగా ఈ అంశం మీద వేణు స్వామికి మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద 22వ తేదీన వేణు స్వామి వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లుగా మహిళా కమిషన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఒక రకంగా ఇప్పటివరకు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను బహిర్గతంగా కామెంట్లు చేస్తూ వీడియోలు చేస్తూ వచ్చిన వేణు స్వామికి ఇది షాక్ అనే చెప్పుకోవాలి. దీనిపై వేణు స్వామి ఎలా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉంది.
Read Also: Jogi Ramesh : జోగికి మరో షాక్..అరెస్ట్ తప్పదా..?