Rain Alert Today : ఇవాళ ఈ 8 జిల్లాల్లో వర్షాలు
Rain Alert Today : తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- By Pasha Published Date - 07:04 AM, Mon - 31 July 23

Rain Alert Today : తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీగా వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ ఏడాది భారీ వర్షాలు జనాన్ని హడలెత్తించినా.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో వర్షాలు 19 శాతం తక్కువగానే కురిశాయని వాతావరణ కేంద్రం వివరించింది.
Also read : Telangana: నల్గొండ ఎటిఎంలో చోరీ.. 23 లక్షలు అపహరణ
2022 సంవత్సరంలో జూన్ నుంచి జులై 30 మధ్యకాలంలో 687.1 మిల్లీమీటర్ల వాన(Rain Alert Today) పడింది. ఈ ఏడాది జూన్ నుంచి జులై 30 మధ్యకాలంలో 559.1 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.ఈ నెలలో నిర్మల్ మండలంలో అత్యధికంగా 16.5 సెంటీమీటర్ల వర్షం పడింది. కరీంనగర్ రూరల్ మండలంలో 16 సెంటీమీటర్ల వర్షం, నిర్మల్ గ్రామీణ మండలంలో 14.9, ఖానాపూర్ లో 13.1, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 12.6, రాయికల్ లో 10.3, జగిత్యాల గ్రామీణ మండలంలో 10.2, నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చాందలో 9.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 8, కరీంనగర్ జిల్లా వీణవంకలో 7.5 సెంటిమీటర్ల వర్షం పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.