HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Secretariat Inaugurated By Cm Kcr

Telangana Secretariat: బ్రేకింగ్.. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..!

ప్రతిష్టాత్మక తెలంగాణ సచివాలయాన్ని (Telangana Secretariat) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తూర్పు గేటు నుంచి సచివాలయానికి సీఎం చేరుకున్నారు.

  • Author : Gopi Date : 30-04-2023 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Secretariat
Resizeimagesize (1280 X 720)

ప్రతిష్టాత్మక డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని (Telangana Secretariat) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తూర్పు గేటు నుంచి సచివాలయానికి సీఎం చేరుకున్నారు. యాగశాలలో పూజ కార్యక్రమం అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, ఎంపీ సంతోష్ కుమార్, సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ ప్రాంగణం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లింది. పోడు పట్టాల మార్గదర్శాకాల ఫైల్ పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు.

సచివాలయం ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. CM ఛాంబర్‌, విశిష్ట అతిథులతో సమావేశమయ్యే మందిరం, డైనింగ్‌ హాల్స్‌ వంటి నిర్మాణాల్లో ఉన్న తెలుపు, క్రీమ్‌ మధ్యలో సన్నటి బంగారు రంగు పట్టీలతో ఉన్న కలర్‌ స్కీం, ఫ్రాన్స్‌లోని వెర్సెల్లెస్‌ రాజభవనంలోని గదుల్ని తలపిస్తున్నాయి. ప్రజాదర్బారు నిర్వహించేందుకు కనీసం 250మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు.

Also Read: Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం అందర్నీ కట్టిపడేస్తోంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తోంది. తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు.. ఇందులో 8 ఎకరాలను పూర్తిగా పచ్చదనం కోసమే కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • hyderabad
  • telangana
  • telangana secretariat

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Nepali Gang Loots Gold In Hyderabad

    Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

  • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

  • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

  • Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

  • Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd