Assembly Meetings : డిసెంబర్ 9నుండి తెలంగాణ శాసనసభ సమావేశాలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
- Author : Latha Suma
Date : 21-11-2024 - 5:27 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana assembly meetings : డిసెంబర్ 9నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుండటంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు గురించి సభలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాక..ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించాలని ప్రభుత్వం చూస్తోంది. రైతురుణమాఫీ, కులగణనపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కానీ, ఆలోపే మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు జరుగుతోందని కూడా సమాచారం అందుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తుంది. పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు రేవంత్ ప్రభుత్వం రు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఎలక్షన్స్‌కు ముందు పెన్షన్, రైతు భరోసాను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇంకోవైపు ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొండపోచమ్మ సాగర్ దగ్గరలోని మాజీ మంత్రి హరీష్ రావు ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించనున్నట్లు సమాచారం.
Read Also: Manukota : బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు అనుమతి