HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Gurukul Pgt Exam Delayed Due To Technical Snag

Gurukul PGT Exam: పీజీటీ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపం.. అభ్యర్థుల నిరసన

తెలంగాణలో ఈ రోజు సోమవారం గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యంగా జరగడంతో

  • Author : Vamsi Chowdary Korata Date : 21-08-2023 - 1:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gurukul PGT Exam
New Web Story Copy (64)

Gurukul PGT Exam: తెలంగాణలో ఈ రోజు సోమవారం గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యంగా జరగడంతో కొన్ని చోట్ల అభ్యర్థులు నిరసనలకు దిగారు. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వెలుపల వేచి ఉన్నారు.

తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పీజీటీల భర్తీకి ఇంగ్లీష్ పరీక్ష అన్ని ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయానికి అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. సిబ్బందిని విచారించగా సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పరీక్ష నిర్వహణ ఆలస్యమైందని తెలిపారు. ఉదయం 10గంటలు దాటినా పరీక్ష ప్రారంభమయ్యే సూచనలు కనిపించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్ష రాసేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన తమకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అభ్యర్థులు వాపోయారు.

హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లోని ఒక పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు హైదరాబాద్-విజయవాడ రహదారిపై కూర్చొని నిరసనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అభ్యర్థులను ఉదయం 10.30 గంటలకు కేంద్రంలోకి అనుమతించారు, చివరకు పరీక్ష ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైంది. ఫిజికల్ సైన్స్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల నుంచి, బయోలాజికల్ సైన్స్ పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి జరగనుంది. దీంతో రెండు పరీక్షలను అధికారులు వాయిదా వేసే అవకాశం ఉంది.

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఆర్‌ఈఐఆర్‌బీ) తొమ్మిది కేటగిరీల్లోని 9210 పోస్టులకు ఆగస్టు 1 నుంచి పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు 2.66 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం 1,276 పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఆగస్టు 23న ముగియనున్నాయి.

Also Read: Monsoon Tours: చూడాల్సిందే తరించాల్సిందే, కమనీయం కర్ణాటక పర్యాటకం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delay
  • Gurukul
  • hyderabad
  • PGT Exam
  • protest
  • students
  • technical snag
  • telangana

Related News

Anna Hazare: Indefinite hunger strike from July 5 if amendments to Maharashtra RTI rules are not revoked.

Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

పారదర్శకత చట్టాన్ని బలహీనపరిచే సవరణలుగా తాను అభివర్ణించిన ‘మహారాష్ట్ర సమాచార హక్కు (RTI) నిబంధనలు-2026’ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే, జూలై 5 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సీనియర్ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. కొత్త నిబంధనల కింద ప్రవేశపెట్టిన అనేక అంశాలు ‘సమాచార హక్కు చట్టం’ యొక్క స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయని, అలాగే ప్రభుత్వ సంస్థ

    Latest News

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd