HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Government Measures For Modernization Of Mortuaries

Mortuaries: మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత.

  • Author : Balu J Date : 02-02-2022 - 1:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Martuaries
Martuaries

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించడం, పార్థీవ రథాల ద్వారా భౌతిక కాయాన్ని ఇంటి వద్దకు చేర్చడం, అనంతరం గౌరవంగా ఖననం చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా ఈ క్రమంలో ఇప్పటికే ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయగా, అన్ని పట్టణాల్లో వైకుంఠ ధామాల ఏర్పాటు వేగంగా సాగుతున్నది. మృతదేహాలను తరలించేందుకు వైకుంఠ రథాలను ఏర్పాటు చేసింది.

ఇప్పుడు మార్చురీల ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఒకప్పుడు మార్చురీలు కనీస వసతులు లేక దారుణంగా ఉండేవి. ముక్కు మూసుకొని విధులు నిర్వహించాల్సిన దుర్భర పరిస్థితి. మృతుల బంధువులు విదేశాల నుంచి రావాల్సి ఉంటే.. పార్థివ దేహాలను నిల్వ చేసేందుకు కూడా వసతులు లేవు. దీంతో కడసారి చూపు దక్కని సందర్భాలు ఎన్నో.. ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చురీ లను ఆధునీకరిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 113 చోట్ల మార్చురీలు ఉన్నాయి. వాటిల్లో అవసరమైన పరికరాలు, ఫ్రీజర్లు, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మార్చురీల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా నూతన మార్చురీ విధానాన్ని అమలు చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసింది. ఇందులో 10 టీచింగ్ ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు రూ.11.12 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 51 దవాఖానల్లో మర్చూరీల ఆధునికీకరణకు రూ. 21.42 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. హైదారాబాద్ లోని ఉస్మానియా, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులతో పాటు మహబూబ్ నగర్, నల్గొండ సూర్యాపేట, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ బోధనాసుపత్రులు ఇందులో ఉన్నాయి.

తెలంగాణ రాకముందు వైద్య కళాశాలల్లో మాత్రమే ఫోరెన్సిక్‌ నిపుణులు ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మార్చురీ కేంద్రాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులను నియమిస్తున్నది. వైద్యవిధాన పరిషత్తు దవాఖానల్లో 102 ఫోరెన్సిక్‌ నిపుణుల పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 63 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 20 డీసీఎస్‌, 19 సీఎస్‌ పోస్టులు ఉన్నాయి. గతంలో ఎవరైనా దవాఖానల్లో మరణిస్తే.. ఆ పార్థివ దేహాలను సొంతూళ్ల‌కు తీసుకెళ్లడం పెద్ద సమస్యగా ఉండేది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రైవేట్‌ వాహనదారులు సాధారణ చార్జీ కన్నా ఐదారు రెట్లు అధికంగా వసూలు చేసేవారు. దీంతో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా భారం పడేది. ఈ కష్టాన్ని, వేదనను మనసుతో అర్థం చేసుకున్న ప్రభుత్వం.. పార్థివ దేహాలను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చింది. ప్రస్తుతం 50 వాహనాలు ఉండగా.. మరో 16 నూతన వాహనాలను త్వరలో ప్రారంభించుకోబోతున్నాము.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fund
  • modernization of mortuaries
  • telangana
  • Ts govt

Related News

Loan App Harassment

లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. కేవలం రూ.3 వేల కోసం ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లిలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ గతంలో ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రూ.3 వేల రుణం తిరిగి చెల్ల

  • Telangana Rtc Bus Stand

    ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

  • Cm Revanth Municipal Electi

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

Latest News

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd