HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Government Issued Key Orders On Go 317

Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు.

  • Author : Latha Suma Date : 30-11-2024 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana government issued key orders on GO-317
Telangana government issued key orders on GO-317

Employee Issues : తెలంగాణ ప్రభుత్వం జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి మార్గదర్శకాలతో కూడిన 243, 244, 245 ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక, ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

కాగా, రేవంత్ సర్కారు త్వరలోనే తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు  శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ జీవో అమలుతో ఇబ్బందులకు గురైన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్య కారణాలున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్ సంతకం చేసినట్టు సమాచారం. 317 జీవోపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ సబ్ కమిటీ మ్యూచువల్, హెల్త్ గ్రొండ్, స్పౌజ్ ట్రాన్స్‌ఫర్లు జరపాలని కొన్ని రోజుల కిందట ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డికి పంపగా.. శుక్రవారమే దాన్ని ఆమోదించినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

ఇటీవల సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షతన ఉపసంఘం సమావేశమైంది. స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా కేటాయింపు జరగాలని అభిప్రాయపడింది. స్థానికతకు అవరోధంగా ఉన్న క్లాజ్‌లపై మంత్రులు రాజనర్సింహ, శ్రీధర్‌బాబు 3 గంటలకుపైగా న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. తుది నివేదిక పత్రాలను రూపొందించింది. ఇటీవల ఈ నివేదిక పత్రాలను సీల్డ్ కవర్‌లో మంత్రి దామోదర రాజనర్సింహా సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

Read Also: Traffic Challan : డ్రైవింగ్ చేస్తూ సిగరెట్ తాగితే చలాన్ వేస్తారా..? సమాధానం మీకు తెలుసా?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • CS Shanti Kumari
  • Employee Issues
  • GO 317
  • government employees
  • Telangana Govt Guidelines

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • Telangana State Assembly Budget Sessions from March 16 to 30

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • Virosh Wedding

    ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

Latest News

  • బీసీల రిజర్వేషన్ల పై మరోసారి దృష్టి .. ఏదో ఒకటి తేలాకే పరిషత్ ఎన్నికలు .. !

  • మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత‌ప‌డ‌నున్నాయంటే?

  • ప్రభుత్వ కాలేజీలకు కొత్త ఊపు .. ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు : మంత్రి లోకేష్‌

  • వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్లు ప్రచారం చేయకండి: శిఖ‌ర్ ధావ‌న్‌

Trending News

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd