Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
- By Praveen Aluthuru Published Date - 10:53 PM, Thu - 14 March 24

Telangana TET 2024: టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29న ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలపై ప్రభుత్వం స్పందించి టెట్ ప్రక్రియను వేగవంతం చేయాలని పాఠశాల విద్యా కమిషనర్‌ను ఆదేశించింది. డీఎస్సీకి హాజరు కావడానికి టెట్ తప్పనిసరి అయినందున ప్రభుత్వ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్ధులకు లబ్ధి చేకూరనుంది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ జారీ చేసే అవకాశం ఉంది..
అంతకుముందు టెట్ నిర్వహించిన తర్వాతనే డీఎస్సీ నిర్వహించాలని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రతిపక్షాలు కూడా టెట్ ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
డీఎస్సీ ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు పోస్టులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 796 ఎస్జీటీ పోస్టులున్నాయి. అత్యధిక పోస్టులు హైదరాబాద్‌లో 878 ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మంలో 757, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 పోస్టులున్నాయి.
Also Read: Janasena Vs TDP In Pithapuram : పిఠాపురంలో పవన్ ను ఓడిస్తాం అంటున్న టీడీపీ శ్రేణులు