Janasena Vs TDP In Pithapuram : పిఠాపురంలో పవన్ ను ఓడిస్తాం అంటున్న టీడీపీ శ్రేణులు
- By Sudheer Published Date - 10:36 PM, Thu - 14 March 24

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నడుస్తున్న బ్యాడ్ టైం మరే ఏ నేతకు నడవడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ ఒకటి తలిస్తే మరోటి జరుగుతుంది. జగన్ ను గద్దె దించాలనే ఉద్దేశ్యం తో ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు..చివరకు ఈయనే గెలిచే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఏ క్షణాన పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాడో..అప్పటి నుండి ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. పవన్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా జనసేన శ్రేణులకు నచ్చడం లేదు. అంతే ఎందుకు ఇప్పుడు టీడీపీ శ్రేణులకు కూడా నచ్చడం లేదు. తాజాగా ఈరోజు గురువారం అయన పిఠాపురం (Pithapuram ) నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తెలిపిన దగ్గరి నుండి అక్కడి అసమ్మతి సెగలు మొదలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ (Varma) అనుచరులు రోడ్ పైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. టీడీపీ వర్మను మోసం చేసిందని ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెడుతూ చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేశారు. వర్మకు టికెట్ ఇవ్వాలని లేకుంటే.. టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వర్మ అనుచరులు అల్టిమేటం ఇచ్చారు. వర్మకూ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. వర్మ జిందాబాద్.. పవన్ గో బ్యాంక్ అంటూ నినాదాలు చేశారు. మొత్తంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగను రేపింది.
పిఠాపురంలో టీడీపీ అసమ్మతి తీవ్రత చూశాక పవన్ కల్యాణ్ గెలుపు కష్టమేనని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కి వ్యత్తిరేకంగా టీడీపీ నేతలు పరోక్ష నిరసనలు తెలియజేయడంపై జనసేన కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం తమ నాయకుడు ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వ్యక్తి పోటీ చేస్తానంటే.. ఇంతలా నిరసనలు తెలియజేస్తారా అంటూ జనసైనికులు మండిపడుతున్నారు. ఇలా ఉంటుంది టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే..మన పరువు మనమే తీసుకుంటున్నామని వారంతా వాపోతున్నారు.
Read Also : Malkajgiri BRS MP Candidate : మల్కాజ్‌గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి