Flood Damage : వరద నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి రిపోర్టు
ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది..
- By Latha Suma Published Date - 02:24 PM, Wed - 4 September 24
Telangana Govt : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అంచనా రిపోర్ట్ ని సిద్ధం చేసింది.. ఈ మేరకు రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది.. అదేవిధంగా జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ని అందుబాటులో ఉంచి ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర వ్యాప్తంగా 110 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 4000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా ఈ శిబిరాలకు తరలించారు. శిబిరాల్లో ఉన్నవారికి భోజనంతోపాటు అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది.. రాష్ట్రంలో వర్షాల కారణంగా కలిగిన నష్టం 5వేల438 కోట్ల రూపాయలు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేసింది. ఆర్అండ్ బీ శాఖకు సంబంధించి 2వేల 362 కోట్ల రూపాయలు, ఇంధన శాఖ సంబంధించి 175 కోట్ల రూపాయలు పంట నష్టం ఏర్పడినట్టు అంచాన వేసింది.
Read Also: Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు
నీటిపారుదల శాఖకు సంబంధించి 415 కోట్లు, పంచాయతీ గ్రామీణాభివృద్ధి సంబంధించి 629 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అలాగే, వైద్య ఆరోగ్యశాఖ కు సంబంధించి 170 కోట్ల రూపాయలు, పశు సంవర్ధక శాఖ కు 12 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట కు సంబధించి 25 కోట్లు, ఇతర విభాగాలకు 11 వేల 50 కోట్లు నష్టం ఏర్పడినట్టు అంచనా వేసింది. ప్రజా ఆస్తులు 500 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్టు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది.
ఇక వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత. జిల్లాల వారిగా జరిగిన నష్టం పై రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టుని సిద్ధం చేయనుంది.. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించి జరిగిన నష్టం పై నివేదిక తయారు చేస్తుంది. ఇవ్వనుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించనుంది అనేది ఆసక్తి గా మారింది..ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ లో పర్యటించాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం.
Read Also: Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు
ఇక రాష్ట్రంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు, మేకలు, గొర్రెలకు 3 వేల నుంచి 5 వేల రూపాయలు పెంచింది. తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ..వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాల కలెక్టర్స్ ని అలెర్ట్ చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైనా ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది ప్రభుత్వం.
Read Also: Relationship Tips : ఈ విషయాలు భార్యభర్తల మధ్య వివాదానికి కారణమవుతాయి…!
Related News
Hydra : హైడ్రాకు మరో కీలక బాధ్యత..!
Another key responsibility for Hydra: ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరంలో ఇళ్ల నిర్మాణాలకు ఇక నుంచి హైడ్రా వద్ద కూడా ఎన్ఓసీ పొందాలనే కొత్త నిబంధనను అనుమతుల ప్రక్రియలో చేర్చే యోచనలో సర్కార్