HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cpm To Hold Dharna At All Revenue Offices On August 29

Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు

బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్‌ అనుసరిస్తోందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-08-2024 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thammineni Veerabhadram
Thammineni Veerabhadram

Telangana: బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్‌ అనుసరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు తమ్మినేని వీరభద్రం.

ఈ రోజు శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్‌ అనుసరిస్తోందని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాకముందే పలువురు సీపీఎం కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని అన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

రుణమాఫీకి రేషన్‌కార్డులను ప్రాతిపదికగా తీసుకోబోమని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రెండు గ్రామాల్లో రుణమాఫీపై అధ్యయనం చేయగా 1,100 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే రుణమాఫీ చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఫుల్ ట్యాంక్ లెవల్, ఇరిగేషన్ ట్యాంకుల బఫర్ జోన్‌లలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన చర్య అని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Shikhar Dhawan Retirement: ధావన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరు?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • August 29
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • cpm
  • crop loan
  • dharna
  • Revenue offices
  • telangana
  • telugu news

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd