Shikhar Dhawan Retirement: ధావన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరు?
ఒకప్పుడు ధావన్ టీమిండియాకు భవిష్యత్తు క్రికెటర్ గా ఆశలు రేపాడు. కానీ ధావన్ పేలవమైన ఫామ్ అతడి కెరీర్ను దెబ్బ కొట్టింది. ముఖ్యంగా కన్సిస్టెన్సీ లేకపోవడం ద్వారా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు టీమ్ ఇండియాకు ఓపెనింగ్ ఆప్షన్లు ఎక్కువయ్యాయి. వారందరూ యువకులే
- By Praveen Aluthuru Published Date - 08:34 PM, Sat - 24 August 24

Shikhar Dhawan Retirement: ఒకప్పుడు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా నిలిచింది. ఈ జంట సచిన్ టెండూల్కర్ మరియు సౌరవ్ గంగూలీల జోడీని గుర్తు చేసింది. ఈ జోడి గతంలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. కాలక్రమేణా రోహిత్ శర్మ భాగస్వాములు మారారు. ఈ క్రమంలో ధావన్ అదృశ్యమయ్యాడు. కుర్రాళ్ళ ఎంట్రీతో ధావన్ తిరిగి జట్టులోకి రావడం అసాధ్యంగా మారింది. దీంతో తన క్రికెట్ కెరీర్ను ముగించేశాడు.
ఒకప్పుడు ధావన్ టీమిండియాకు భవిష్యత్తు క్రికెటర్ గా ఆశలు రేపాడు. కానీ ధావన్ పేలవమైన ఫామ్ అతడి కెరీర్ను దెబ్బ కొట్టింది. ముఖ్యంగా కన్సిస్టెన్సీ లేకపోవడం ద్వారా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు టీమ్ ఇండియాకు ఓపెనింగ్ ఆప్షన్లు ఎక్కువయ్యాయి. వారందరూ యువకులే. ఈ పరిస్థితిలో టీమిండియాకు మళ్లీ ఆడాలనే ధావన్ కల కలగానే మిగిలింది. ధావన్ జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ వచ్చాడు. గిల్ తన బ్యాటింగ్‌తో అలాంటి ముద్ర వేశాడు. ప్రస్తుతం టీమిండియా భవిష్యత్తు అతనేనని మాజీలు అభిప్రాయపడుతున్నారు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయిన తర్వాత గిల్ వన్డే మరియు టి20లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇది గిల్‌ను తదుపరి కెప్టెన్‌గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు అర్ధమవుతుంది. అంటే గిల్ ఓపెనర్‌గా రాణిస్తాడన్నమాట.
రోహిత్ వన్డేలు, టెస్టులు ఆడుతున్నంత కాలం ఓపెనింగ్‌గానే ఉంటాడు. రోహిత్ టీ20 నుంచి రిటైరయ్యాడు. అతని స్థానంలో గిల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ తన తుఫాను బ్యాటింగ్‌తో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. టెస్టుల్లోనూ యశస్వి అద్భుతాలు చేస్తున్నాడు. అంటే ప్రస్తుతం టీమిండియా ప్రధాన ఓపెనర్లుగా రోహిత్, గిల్, జైస్వాల్ ఉన్నారు.బ్యాకప్‌గా భారత్‌కు రితురాజ్ గైక్వాడ్ ఎంపిక ఉండనే ఉంది, అతను టెస్ట్‌లో రోహిత్ స్థానంలో ఖచ్చితంగా రాణించగలనన్న ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. . ఐపీఎల్‌తో పాటు ఇటీవల జింబాబ్వే టూర్‌లో అభిషేక్ శర్మ ఓపెనర్‌గా ఆకట్టుకున్నాడు. అంటే రోహిత్‌ని తొలగిస్తే క్లాస్, టెక్నిక్, అటాకింగ్ అప్రోచ్ మరియు వయస్సు ఉన్న గిల్, జైస్వాల్, అభిషేక్ మరియు గైక్వాడ్‌ల రూపంలో భారత్‌కు అలాంటి ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. టీమిండియాలోకి ధావన్ పునరాగమనం అసాధ్యంగా మారడానికి ఇదే కారణం. ధావన్ 2010లో భారతదేశం తరపున తొలి వన్డే ఆడాడు. 2022లో భారత్ తరుపున తన చివరి మ్యాచ్ ఆడాడు.
Also Read: AP-Telangana Cable Bridge: ఏపీ-తెలంగాణ కేబుల్ వంతెన కోసం టెండర్ ప్రక్రియకు ముహూర్తం ఖరారు