HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Supreme Court Rejects Telanganas Plea Regarding The Banakacherla Petition

Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • Author : Vamsi Chowdary Korata Date : 13-07-2026 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court rejects Telangana's plea regarding the Banakacherla petition.
Supreme Court rejects Telangana's plea regarding the Banakacherla petition.

గోదావరి జలాల వినియోగంతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉపశమనం లభించలేదు. తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గోదావరి జలాలు, బనకచర్ల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తాత్కాలిక నిలుపుదల (ఇంజంక్షన్) ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే.. ప్రధాన పిటిషన్‌లోనే పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అందులో ఉన్న లోపాలను సరిదిద్దకుండా కేసు విచారణను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. ముందుగా నిబంధనలకు అనుగుణంగా ఆ పిటిషన్‌ను సవరించాలని.. ఆ తర్వాతే కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఇక.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించకముందే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం లేదా ఈ వ్యవహారంలో తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం న్యాయపరంగా సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల నదీ జలాల విషయంలో తక్షణమే స్టే ఇవ్వడంతోపాటు.. ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

మరోవైపు.. ఆ పిటిషన్‌లోని లోపాలను సరిచేసిన తర్వాత తిరిగి దానిపై విచారణ చేపట్టి.. మిగిలిన న్యాయపరమైన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం, బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన వివాదంలో ఏం జరగనుంది అనే పరిణామాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి సుప్రీంకోర్టు తదుపరి విచారణపైనే నిలిచింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Godavari Banakacharla Project
  • Godavari Water Dispute
  • Suprem Court
  • telangana government
  • Water Rights

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

Latest News

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd