HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Super Specialty Hospital With Rs 300 Crores In Mancherial

Super Specialty Hospital: మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ఏర్పాటు!

జిల్లాలోని కిడ్ని డయాలసిస్‌ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • By Gopichand Published Date - 08:25 PM, Thu - 21 November 24
  • daily-hunt
Super Specialty Hospital
Super Specialty Hospital

Super Specialty Hospital: ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (Super Specialty Hospital) ఏర్పాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు, ఎలక్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గార్లతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు మంచి ఆలోచన అన్నారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు.

వైద్య సేవల కోసం హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లకుండా 90 శాతం వైద్యం ఇదే ప్రాంతంలో ఉచితంగా అందించి ప్రజలలో భద్రత, నమ్మకం కలిగిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 6 పడకలను 30 పడకలకు అప్‌ గ్రేడ్‌ చేయడంతో పాటు మరిన్ని ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, సుమారు 54 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అత్యవసర సేవల సమయంలో వేగవంతమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్‌ సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాలలో 2, మండలానికి 1 చొప్పున అందించేందుకు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రతి 30-35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలు ప్రాణాపాయానికి గురి కాకుండా బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాలలో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: Adani Group : గత వైసీపీ ప్రభుత్వం తో 200 మిలియన్ డాలర్లతో అదానీ ఒప్పందం..?

జిల్లాలోని కిడ్ని డయాలసిస్‌ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో అదనంగా 29 ఉప కేంద్రాల ఏర్పాటుతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలోని వెంకట్రావుపేట, చెన్నూర్‌ నియోజకవర్గంలోని అంగ్రాస్‌ పల్లి లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉత్తర తెలంగాణలో 4 క్యాన్సర్‌ కేంద్రాలు, వస్కులర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వైద్య సిబ్బంది సంఖ్యను పెంచి ప్రజలకు వైద్య సేవలను సంపూర్ణంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలను విద్యావంతులను చేసి సమాజంలో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు రాష్ట్ర అభివృద్ధిలో జవాబుదారీగా ఉండాలని, సిద్ధాంత పరంగా సమాజ అభివృద్ధిలో భవిష్యత్తు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ఐ.టి., పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం సంవత్సర కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి సాధించిందని, ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్‌ 7వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ద్వారా 7 నియోజకవర్గాలు, మహారాష్ట్ర చత్తీస్‌ ఘడ్‌, ఇతర రామ్రాల నుండి వైద్య సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు అందుబాటులో అన్ని సేవలను అందించడం జరుగుతుందని, ప్రజలకు భారం కాకుండా ఉచితంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతని ఇస్తుందని, ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అకుంఠిత దీక్షతో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపుకు గురికాకుండా 262 కోట్ల రూపాయల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, 40 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో మొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుకు ఆర్థిక క్రమశిక్షణతో చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌, లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించడం జరుగుతుందని, వసతి గృహ విద్యార్థులకు కాస్మాటిక్‌, డైట్‌ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా రైతులకు 3 విడతలలో రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ క్రింద అందించడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్‌ అందించడం జరుగుతుందని, సింగరేణి సంస్థలో పని చేస్తున్న కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు బోనస్‌ అందించామని, 800 మెగావాట్ల సామర్ధ్యంతో 3 పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని, ఆర్థిక వ్యవస్థను సరిచేసి ప్రతి లబ్బిదారుడికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో టి.జి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. ఎం.డి. హేమంత్‌ బోర్కడే, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, రామగుండం కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీనివాస్‌, తెలంగాణ మినిమమ్‌ వేజెస్‌ బోర్డ్‌ చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్‌ రాజ్‌, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.డి. సులేమాన్‌ లు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 300 Crores
  • Mancherial
  • Minister Damodar Raja Narasimha
  • Minister Sridhar Babu
  • Super Specialty Hospital
  • telangana
  • telangana news
  • telugu news

Related News

Group-1 Candidates

Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.

  • CM Revanth Reddy reviews torrential rains, floods, issues key instructions to officials

    Heavy Rains : అలర్ట్ గా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు

  • Liquor Shops

    Liquor Shops: తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల!

  • Dussehra Holidays

    Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

  • Dating App

    Dating App: షాకింగ్ ఘటన.. డేటింగ్ యాప్ ద్వారా క‌లుసుకున్న ఇద్ద‌రు యువ‌కులు!

Latest News

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

Trending News

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd