HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Single Shift Schools Census Survey Telangana Primary Teachers

Caste Enumeration: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

Caste Enumeration : రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేలో భాగంగా ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయి.

  • Author : Kavya Krishna Date : 05-11-2024 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Caste Enumeration
Caste Enumeration

Caste Enumeration : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన కార్యక్రమం చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేలో భాగంగా ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కులగణన సర్వేలో భాగంగా ఈ స్కూల్స్‌లో ఉన్న టీచర్లు మూడు వారాల పాటు ఈ సర్వేలో పాల్గొంటారు. అందుకే, ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఈ మూడు వారాలు సర్వే నిర్వహణ కోసం పాటించాల్సిన షెడ్యూల్ ప్రకారం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు , 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ కులగణన సర్వేలో భాగంగా విధులు నిర్వర్తిస్తారు. అయితే, ఈ ఒంటిపూట బడులు కేవలం ప్రాథమిక పాఠశాలలకే వర్తిస్తాయని, హైస్కూళ్లు తన మాములు షెడ్యూల్‌లోనే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కులగణన సర్వేను ఈ నెల 30వ తేదీకి ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించి, రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కమిషన్‌లో విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను చీఫ్‌గా నియమించారు. కమిషన్‌ పనిచేసి, ఎస్సీ కులాల మధ్య ఉన్న వెనకబాటుతనాన్ని అధ్యయనం చేసి, 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులగణన, వర్గీకరణ వంటి కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సర్వేను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : New Traffic Rules : హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • census participation
  • census survey
  • government schools
  • midday meals
  • Primary school teachers
  • primary schools
  • school schedule
  • School timings
  • secondary grade teachers
  • single shift schools
  • teacher duties
  • telangana education
  • telangana government

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

  • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

  • Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు

  • Pullela Gopichand: గోపీచంద్ అకాడమీతో చుప్స్ ఫుట్‌వేర్ భాగస్వామ్యం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd