HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Shivajis Descendant Sambhajiraje Met With Cm Kcr

CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje)  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు.

  • By Gopichand Published Date - 06:30 AM, Fri - 27 January 23
CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje)  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం భోజనంతో వారికి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం సీఎంతో సుధీర్ఘంగా పలు అంశాల మీద లోతైన చర్చలు జరిగాయి.

దేశానికే ఆదర్శంగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆయన ఆరా తీసారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అన్ని వర్గాల ప్రజలకు ఇంత గొప్పగా సంక్షేమాన్ని అందిచడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై ఛత్రపతి శంభాజీ రాజె ఆసక్తిని కనబరిచారు.

Also Read: Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!

తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని శంభాజీ రాజె తన ఆకాంక్షను వెల్లడించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు, దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి వుందని రాజె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చ సాగింది. దేశ ప్రజల అభ్యున్నతికి, దేశ సమగ్రతకు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండా ప్రజలముందుకు రావాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. అవసరమైతే మళ్లీ ఒకసారి కలుసుకుని అన్ని అంశాలపై చర్చిద్దామని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఛత్రపతి శంభాజీ రాజ్ పూర్వీకులు శివాజీ మహారాజ్ నుంచి సాహూ మహారాజ్ దాకా ఈ దేశానికి వారందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందంచిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వారి స్ఫూర్తితోనే, కుల, మత వివక్షకు తావు లేకుండా తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎంకు ఛత్రపతి శంభాజీ రాజె అందించారు.

Telegram Channel

Tags  

  • cm kcr
  • hyderabad
  • republic day
  • Sambhajiraje
  • Shivaji
  • telangana
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం

CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం

ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు.

  • TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!

    TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!

  • KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వారం రోజులే గడువు..!

    KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వారం రోజులే గడువు..!

  • Hyderabad: హైదరాబాద్‌లోని 50 సరస్సులకు తెలంగాణ ప్రభుత్వం పునరుజ్జీవనం..!

    Hyderabad: హైదరాబాద్‌లోని 50 సరస్సులకు తెలంగాణ ప్రభుత్వం పునరుజ్జీవనం..!

  • SRH Team: పేరులోనే హైదరాబాద్.. ఒక్క హైదరాబాదీ క్రికెటరూ లేడు

    SRH Team: పేరులోనే హైదరాబాద్.. ఒక్క హైదరాబాదీ క్రికెటరూ లేడు

Latest News

  • MS Dhoni: ఐపీఎల్‌లో ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ కాదు.. మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ

  • Google Users: ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు షాక్.. 2 వేలు దాటితే!

  • Jagan Delhi :`ముంద‌స్తు` షెడ్యూల్‌,జ‌గ‌న్ ఢిల్లీ సీక్రెట్స్ ఇవేనా?

  • Tollywood War: టాలీవుడ్ లో వర్గ పోరు.. చెర్రీ బర్త్ డే వేడుకలకు బన్నీ, ఎన్టీఆర్ డుమ్మా!

  • Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?

Trending

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

    • Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: