HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sankranti Festival Time Robbers Gangs In Trains Passengers Beware

Robbers In Trains : సంక్రాంతి రద్దీ.. రైళ్లలో దొంగల ముఠాలు.. పారా హుషార్

మహిళల మెడలోని గొలుసులను లాగే చైన్ స్నాచర్ బ్యాచ్‌లు కూడా ట్రైన్లలో(Robbers In Trains) తిరుగుతున్నాయట. 

  • Author : Pasha Date : 12-01-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Robbers Gangs In Trains Passengers Sankranti 2025

Robbers In Trains : సంక్రాంతి వేళ రైళ్ల నుంచి బస్సుల దాకా.. బస్సుల నుంచి విమానాల దాకా ప్రతీచోటా ప్రయాణికుల రద్దీ ఉంది. ఈ భారీ రద్దీని దొంగలు అదునుగా వాడుకుంటున్నారు. దొంగతనాలకు తెగబడుతున్నారు. ప్రత్యేకించి రైళ్లలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయట. బంగారు ఆభరణాలు, పర్సులు, స్మార్ట్‌ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు వంటి వాటిని వాళ్లు టార్గెట్ చేస్తారట. అందుకే రైళ్లలో ప్రయాణించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.

Also Read :Handloom Mark : తెలంగాణ చేనేత వస్త్రాలపై ఇక ‘హ్యాండ్లూమ్‌ మార్క్‌’.. ఏమిటిది ?

తీరొక్క దొంగలు

  • మహిళల మెడలోని గొలుసులను లాగే చైన్ స్నాచర్ బ్యాచ్‌లు కూడా ట్రైన్లలో(Robbers In Trains) తిరుగుతున్నాయట.  అందుకే మహిళలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచిదని రైల్వే పోలీసులు అంటున్నారు.
  • బంగారు ఆభరణాలు, నగదును ఇంట్లో వదిలేస్తే దొంగలు పడతారనే భయంతో చాలామంది మహిళలు వాటిని తమతోనే తీసుకెళ్తుంటారు. అలాంటి వారిని కూడా దొంగలు టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి.
  • కొంతమంది ప్రయాణికులు రైలులోని కిటీకీలు, డోర్ల వద్ద కూర్చొని సెల్‌ఫోన్లలో మాట్లాడుతుంటారు. దొంగలు ఇలాంటి వాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్లను కాజేసి పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయట.
  • ఇరానీ, హర్యానా దొంగల ముఠాలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఈ ముఠాల్లోని దొంగలు తొలుత తాము టార్గెట్‌గా చేసుకున్న ప్రయాణికుడి దృష్టిని మరలుస్తారు. అనంతరం చోరీకి పాల్పడి క్షణాల్లో పరార్ అవుతారు.
  • రైలులోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడే టైంలో కొందరు దొంగలు తమ పని కానిచ్చేస్తుంటారు. పర్సులు, ఫోన్లు కాజేస్తుంటారు.
  • చాలామంది ప్రయాణికులు రైళ్లలో నిద్రపోతుంటారు. ప్రత్యేకించి రైళ్ల జనరల్ బోగీల్లో నిద్రపోయే ప్రయాణికులను  పార్దీగ్యాంగ్‌ దొంగలు టార్గెట్ చేస్తుంటారు. వారు నిద్రలోకి జారుకోగానే.. పర్సులు, ఫోన్లను చోరీ చేసి పారిపోతుంటారు.
  • సికింద్రాబాద్‌ జీఆర్పీ జిల్లా పరిధిలో జరిగిన చోరీల్లో ఎక్కువ భాగం పండుగ టైంలో జరిగినవే.
  • సికింద్రాబాద్‌ జీఆర్పీ జిల్లా పరిధిలో 2023లో రైళ్లలో 939 చోరీలు జరిగాయి. రూ.3.67 కోట్ల సొత్తు పోయింది. కేవలం రూ.50 లక్షలను రికవర్ చేశారు.
  • సికింద్రాబాద్‌ జీఆర్పీ జిల్లా పరిధిలో 2024లో రైళ్లలో 983 చోరీలు జరిగాయి. రూ.3.67 కోట్ల సొత్తు పోయింది. కేవలం రూ.43 లక్షలను రికవర్ చేశారు.
  • రైల్వే స్టేషన్లు, రైళ్లలో దొంగతనాలు వంటివి జరిగితే  టోల్‌ఫ్రీ నంబరు 139కు కాల్ చేయొచ్చు.

Also Read :Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Makar Sankranti
  • Makar Sankranti 2025
  • Robbers Gangs
  • Robbers In Trains
  • Sankranti
  • Train Passengers

Related News

Swedish Pelicot Case

Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

Swedish Pelicot Case స్వీడన్‌లో “స్వీడిష్ పెలికాట్ కేసు”గా సంచలనం సృష్టిస్తున్న లైంగిక దోపిడీ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్ సభ్యుడొకడు ఒక మహిళను అత్యంత కిరాతకంగా శ్రమదోపిడీకి గురిచేసినట్లు అతడిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె

  • 12 Tonnes Of Kitkats Stolen

    KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Latest News

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

  • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

  • Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd