HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rythu Bharosa Payments Ts Government Fast Track

Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు

రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.

  • Author : Kavya Krishna Date : 20-06-2025 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rythu Bharosa
Rythu Bharosa

Rythu Bharosa : రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమ చేస్తామని సీఎం ఇచ్చిన హామీ ప్రకారం, ఇప్పటికే నాలుగు రోజుల్లోనే రూ.6,405 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది.

జూన్ 16న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతునేస్తం వేదికగా ప్రారంభమైన వానాకాలం రైతు భరోసా చెల్లింపులు క్రమంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు రెండెకరాల వరకున్న రైతులకు, ఆపై మూడు, నాలుగు, ఐదు ఎకరాల వరకున్న రైతులకు విడతల వారీగా నిధులు విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62.47 లక్షల మంది రైతులకు భరోసా నిధులు అందాయి.

ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిమితులు విధించకుండా, సాగు భూముల మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వనుంది. మొత్తం కోటిన్నర ఎకరాలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణ చేపట్టింది. ఇందులో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుగా, మిగతా భాగాన్ని ఇతర ఆదాయ వనరుల ద్వారా సమకూర్చింది.

ఇప్పటికే కోటి ఎకరాల పైచిలుకు భూమికి రైతు భరోసా చెల్లింపులు పూర్తవగా, మిగతా 50 లక్షల ఎకరాలకు మరో ఐదు–ఆరు రోజుల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సాయం వానాకాలం పంటల సాగు ఖర్చులకు ఎంతో ఉపయోగపడనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ స్థాయిలో వేగంగా, విస్తృతంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Vivo Y400 Pro: భారత విపణిలోకి వివో వై400 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agriculture Scheme
  • CM Revanth Reddy
  • farmer welfare
  • Investment Support
  • rythu bharosa
  • telangana government
  • TS Farmers
  • Tummala Nageswara Rao
  • Vaanakalam Crops

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

Latest News

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

  • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd