HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Baba Ramdev Showers Praise On Chandrababu

Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Author : Vamsi Chowdary Korata Date : 20-06-2026 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Baba Ramdev showers praise on Chandrababu.
Baba Ramdev showers praise on Chandrababu.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ ఉదయం చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా యోగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ప్రత్యేకంగా యోగాసనాలు వేయనున్నారు.

ఈ సందర్భంగా ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం ఏది అడిగితే తాము అది చేస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఆయన అందరినీ సమానంగా చూసే గొప్ప లీడర్ కాబట్టే ప్రజలు ఆయన్ని దేవుడిలా భావిస్తారన్నారు.

రాజధాని అమరావతిపై రామ్‌దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అమరావతి అనేది దేవతల రాజధాని. ఇదొక పవిత్రమైన దేవ భూమి. భవిష్యత్తులో ఇక్కడ 40 శాతం పచ్చదనం (గ్రీనరీ), 60 శాతం కాంక్రీట్ నిర్మాణాలు ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రజలు స్విట్జర్లాండ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌కు వస్తే చాలు. ఇక్కడి ప్రకృతి సిద్ధంగా పండించిన మామిడికాయలు, అరటిపండ్లు అమృతంలా ఉంటాయి” అని ప్రశంసించారు.

యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగమని రామ్‌దేవ్ బాబా స్పష్టం చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ (Yoga for Healthy Aging) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • AP CM Chandrababu Naidu
  • Baba Ramdev
  • international yoga day

Related News

Local elections in AP: Alliance aims for victory.

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వేడితో వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ (SEP/OCT) నెలల్లోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, భార

  • Chandrababu makes a key announcement regarding the Godavari Pushkarams.

    Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd