Bigg Boss 7 : బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం
- By Sudheer Published Date - 01:56 PM, Mon - 18 December 23

TSRTC ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar)..బిగ్ బాస్ (Bigg Boss) అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి నిన్న ఆదివారం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ముందు నుండి కూడా కోట్లాది తెలుగు ప్రజలు ప్రశాంత్ విన్నర్ కావాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లు ప్రశాంత్ (Pallavi Prashanth) కప్ గెలుచుకోవడం తో ప్రశాంత్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో కొంతమంది ఆకతాయిలు రచ్చ చేస్తూ.. ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోవైపు బిగ్ బాస్ కాంటెస్ట్స్ కార్ల ఫై కూడా దాడి చేసారు. ఈ దాడిలో పలుకార్ల అద్దాలు ధ్వసం అయ్యాయి. దీనిపై కూడా వారు సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. అభిమానం ఉంటె ఉండాలి..కానీ ఇలా వాహనాలపై దాడి చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇదేం అభిమానం!
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) December 18, 2023
Read Also : Yuvagalam : నారా లోకేష్ తో పాదయాత్ర చేసిన నందమూరి కుటుంబ సభ్యులు