Telangana : ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కూడా సీఎం కేసీఆర్ సిద్ధం – రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని , కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు
- By Sudheer Published Date - 12:24 PM, Sun - 17 September 23

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో CWC సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం తో సమావేశాలు పూర్తి అవుతాయి. అనంతరం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ (Tukkuguda Congress Vijayabheri Meeting) సభ నిర్వహించబోతుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సభా వేదికకగా సోనియాగాంధీ ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల హామీలు ప్రకటిస్తారని ఇప్పటికే AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇక సభ జరగనున్న తరుణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బిజెపి , ఎంఐఎం, బిఆర్ఎస్ పార్టీల ఫై విమర్శలు చేసారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని , కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కూడా సరిపోక.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాలు పంచుకున్నారని విమర్శించారు. మద్యం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని… ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధపడ్డారని అన్నారు. కవిత అరెస్టుతో సానుభూతి పొంది మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేరు కాదని… కేసీఆర్ అనుచరుడే కిషన్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారన్నారు. సాయంత్రం జరిగే విజయ భేరిలో సోనియా గాంధీ హామీలను ప్రకటిస్తారని వెల్లడించారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు సభలోనే శంఖుస్థాపన చేస్తారన్నారు. అలాగే తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఈరోజు విజయ భేరిలో ఇవ్వబోయే హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలిపారు.
Read Also : Telangana : జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్