HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Demands Forensic Audit For Dharani Portal

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

భూసమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • Author : Praveen Aluthuru Date : 16-06-2023 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dharani Portal
New Web Story Copy (87)

Dharani Portal: భూసమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ధరణి పోర్టల్‌పై బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతుంది. ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకుని అధికార పార్టీ నేతల అండతో కొందరు భూఅక్రమాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రెవెన్యూ రికార్డు పోర్టల్‌ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 90 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ తరపున ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెరాసిస్ టెక్నాలజీస్ 52.26 శాతం వాటాను ఫిలిప్పీన్స్‌కు చెందిన కంపెనీకి రూ.1,275 కోట్లకు విక్రయించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ధరణి పోర్టల్ నిర్వహణ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిందన్నారు రేవంత్. ఇ-ధరణి పోర్టల్ భూముల లావాదేవీలకు సంబంధించిన అన్ని రుసుములు నేరుగా శ్రీధర్ రాజు నిర్వహిస్తున్న కంపెనీకి వెళుతున్నాయి. ధరణి పోర్టల్‌లో రూ.50,000 కోట్ల విలువైన 25 లక్షల భూ లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్‌లో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ధరణిపై సమగ్ర విచారణ దర్యాప్తు సంస్థలతో జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు రేవంత్.

ధరణి అనేది ముందుగా 2010 లో ఒరిస్సాలో మొదలు పెట్టారని, కానీ ధరణి కెసిఆర్ నిర్ణయంగా చెప్పుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చురకలంటించారు. కాగా ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర పర్యవేక్షణలో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి)కి అప్పగించాలని కాగ్ తన నివేదికలో సూచించింది.ఇదిలా ఉండగా ధరణిపై వస్తున్న ఆరోపణలను సీఎం కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధరణి పోర్టల్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో ముంచుతామని ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

Read More: Adipurush: నేపాల్‌లో ఆదిపురుష్‌ సినిమాపై వివాదం.. మార్నింగ్‌ షోలు నిలిపివేత..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • dharani portal
  • Dharani Scam
  • Forensic Audit
  • revanth reddy
  • telangana politics
  • transactions

Related News

Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Speaker Gaddam Prasad  తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ, వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిద్దరూ అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారా

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd