Rythu Bharosa : రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
- Author : Latha Suma
Date : 09-07-2024 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
Rythu Bharosa Scheme : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి .. 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే రైతు భరోసా కు నిధులు చెల్లిస్తాం. అందుకే ప్రజా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను మధించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది.
We’re now on WhatsApp. Click to Join.
రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు, ఐదు ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు చేయనున్నారు. రైతు సదస్సులు పూర్తి అయ్యాక అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధివిధానాలను రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించనుంది.
Read Also: Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు విజయం మీ వెంటే?
అంతేకాక 10వ తేదీన ఖమ్మం, 11 ఆదిలాబాద్, 12 మహబూబ్ నగర్, 15 వరంగల్, 16 మెదక్, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప సంఘం చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు, ఇంఛార్జి మంత్రులు కూడా పాల్గొంటారు.
Read Also: 8326 Jobs : టెన్త్ అర్హతతో 8,326 జాబ్స్.. అప్లై చేసుకోండి