HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rebelling Against Modi Is Kcr Cleverness

KCR vs Modi: మోడీపై తిరుగుబాటు కేసీఆర్ చతురత

ఫక్తు రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చికట్లోకి నెట్టేస్తున్నారని విద్యుత్తు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలు తెలంగాణకు నష్టం.

  • Author : CS Rao Date : 10-04-2023 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rebelling Against Modi Is Kcr's Cleverness
Rebelling Against Modi Is Kcr's Cleverness

KCR Against Modi : ఫక్తు రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చికట్లోకి నెట్టేస్తున్నారని విద్యుత్తు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలు తెలంగాణకు నష్టం. అయినప్పటికీ కేసీఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నారు దానికి కారణం తెలంగాణలో బీజేపీ బలపడ్తూ ఉండటమే.

మోడీతో చాలా సక్యతగా ఉన్న కేసీఆర్‌, ఇప్పుడు కత్తులు దూయడానికి అనేక కారణాలు చెపుతున్నప్పటికీ అసలు కారణం తెలంగాణలో బిజెపి బలపడుతుండటమే.తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండటమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు. తాను పదేళ్ళు పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ (KCR) తన కష్టార్జితంతో సంపాదించుకొన్న లేదా గెలుచుకొన్న సొంత రాజ్యంగా భావిస్తున్నారు. కనుక తన రాజ్యానికి తన కొడుకు కేటీఆర్‌ వారసుడు కావాలని కోరుకొంటున్నారు.

కానీ మద్యలో బిజెపి చొచ్చుకు వచ్చింది. కనుక కేసీఆర్‌ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కేంద్రంతో యుద్ధం మొదలుపెట్టారని చెప్పవచ్చు, సింగరేణి గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. నిజానికి తెలంగాణలో ఒక్కటే కాదు… దేశవ్యాప్తంగా కేంద్రానికి ఉన్న అనేక బొగ్గు గనులను వేలం వేస్తోంది.

ఒకవేళ అవి సింగరేణికే అవసరమనుకొంటే, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థ స్వయంగా ఆ వేలంపాటలో పాల్గొని గనులు దక్కించుకోవచ్చు. సింగరేణి సంస్థ ఒడిస్సాలో అలాగే వేలంపాడుకొని బొగ్గు తవ్వకాలు జరుపుకొంటోంది. అదేవిదంగా సింగరేణిలో వేలం వేస్తున్న గనులను దక్కించుకోవచ్చు. కానీ లక్షల కోట్లు విలువ కలిగిన గనులను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిచాలని కేసీఆర్‌ (KCR) కోరుకొంటున్నారు. అది సాధ్యం కాదని కేసీఆర్‌కు కూడా తెలుసు.

అలాగే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వాటాలో బొగ్గు గనులను మాత్రమే వేలం వేస్తోంది తప్ప సింగరేణిలో అన్ని గనులను కాదు. కానీ కేసీఆర్‌ తన రాజకీయ అవసరాల కోసం సింగరేణి మొత్తాన్ని మోడీ ప్రభుత్వం అమ్మేస్తోందంటూ దుష్ప్రచారం చేస్తూ కార్మికులను, ప్రజలను రెచ్చగొట్టి వారిలో బిజెపి పట్ల వ్యతిరేకత, బిఆర్ఎస్‌ కోసం తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవేళ కేసీఆర్‌ మాటలు నమ్మి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న సింగరేణి గనులన్నిటిలో కార్మికులు ధర్నా చేస్తే నష్టపోయేది తెలంగాణ రాష్ట్రామే తప్ప కేంద్ర ప్రభుత్వం కాదు.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతే తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటకం ఏర్పాడుతుంది. దాని వలన విద్యుత్‌ కొరత ఏర్పడి, కోతలు విధించాల్సి వస్తే తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్‌ కొరత ఏర్పడితే సాగునీటి సరఫరా నిలిచిపోతుంది. దాంతో రైతులు నష్టపోతారు. ఒక రాజకీయ కారణంతో ప్రభుత్వమే ఈవిదంగా ధర్నాలు చేయిస్తుంటే కంటికి కనబడని అపార నష్టం జరుగుతుంటుంది. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం కేసీఆర్‌ ఇంకా ఎంత నష్టమైన భరించవచ్చు కానీ రాష్ట్రం, ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?అనే ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేదా కేంద్రమంత్రులు ఎవరైనా పర్యటనకు వచ్చిన ప్రతీసారి సిఎం కేసీఆర్‌ ఏదో ఓ రూపంలో వ్యతిరేకత తెలియజేస్తుంటారు. శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చినప్పుడు కూడా మంత్రులు, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, సింగరేణి బొగ్గుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి పరిధిలో ధర్నాలు చేశారు. “మోడీ హటావో సింగరేణి బచావో” (మోడీని తొలగించి సింగరేణిని కాపాడుకొందాము) అంటూ నినాదాలు చేశారు.

ప్రధాని మోడీ సికింద్రాబాద్‌ – తిరుపతి మదే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన తర్వాత రూ. 11,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రిమోట్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నప్పటికీ, కేసీఆర్‌ ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం చేతిలో నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి చేస్తామని చెప్పడం చూస్తే బీజేపీ అధికారం మీద ఆశ పెట్టుకుంది. అందుకే కేసీ5 బీజేపీ వీళ్ళు ఎవరు రాష్ట్రానికి వచ్చిన విరుచుకు పడుతున్నారు.

Also Read:  Tamilisai Decision on Pending Bills: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Against
  • bjp
  • brs
  • hyderabad
  • india
  • kcr
  • modi
  • pm modi
  • Rebelling
  • telangana

Related News

kurchi-thatha-dies-of-heart-attack

Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.

  • Modi's Special Gift to Italian Prime Minister Meloni

    PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

  • Condom packet in a beer bottle

    Condom Packet: బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్

  • An economic crisis is looming in the country: Rahul Gandhi

    Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

  • Union Minister Bandi Sanjay's mother falls critically ill.

    Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత

Latest News

  • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

  • Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

  • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

  • kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd