Rahul Gandhi : కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎం – రాహుల్
రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందిస్తాం అన్నారు
- By Sudheer Published Date - 10:30 AM, Thu - 2 November 23

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని..కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు కేసీఆర్ (KCR) ఫ్యామిలీ వెనకేసుకుందని , కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎం (ATM)లా మారిందని మొదటినుండి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ (Congress).. ఎన్నికల సమయంలో కూడా అలాగే ఆరోపిస్తూ వస్తుంది. నేడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి (Ambatpally Village ) లో రాహుల్ పర్యటించి..అక్కడ ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సు (Mahila Sadassu)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ..కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందిస్తాం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తామని తెలిపారు. అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి , ఎంఐఎం పార్టీలు వేరు కాదని , ఈ మూడు పార్టీలు ఒక్కటే అని రాహుల్ అన్నారు. ప్రస్తుతం రాహుల్ రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ కి బయలు దేరారు.
Read Also : Rahul Medigadda Barrage : మేడిగడ్డ వద్ద టెన్షన్ వాతావరణం..