Rahul Gandhi : జగిత్యాల సభలో బిఆర్ఎస్ ఫై రాహుల్ ఘాటైన విమర్శలు
దేశాన్ని ముందుండి నడిపించే ఐఏఎస్, ఐపీఎస్‌లలో 90శాతం అగ్రవర్ణాల వారే ఉన్నారని, డిఫెన్స్ బడ్జెట్, ఉపాధి హామీ పథకాలు, రైల్వే బడ్జెట్, సాధారణ కేటాయింపులు మొత్తం చేసేది 90శాతం అగ్రవర్ణాల అధికారులేనని రాహుల్ చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 12:33 PM, Fri - 20 October 23

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)..గత రెండు రోజులుగా తెలంగాణ లో పర్యటిస్తూ బిఆర్ఎస్ (BRS) , బిజెపి (BJP) లపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు జగిత్యాల సభలో బిఆర్ఎస్ ఘాటైన విమర్శలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఓబిసిల గురించి ప్రధాని మోడీ (Modi), కేసీఆర్ (KCR) ఇద్దరు మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడటం లేదని రాహుల్ ప్రశ్నించారు. దేశాన్ని ముందుండి నడిపించే ఐఏఎస్, ఐపీఎస్‌లలో 90శాతం అగ్రవర్ణాల వారే ఉన్నారని, డిఫెన్స్ బడ్జెట్, ఉపాధి హామీ పథకాలు, రైల్వే బడ్జెట్, సాధారణ కేటాయింపులు మొత్తం చేసేది 90శాతం అగ్రవర్ణాల అధికారులేనని రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఇవన్నీ ఆలోచించాలన్నారు. 90శాతం అధికారుల్లో మూడు శాతం మాత్రమే ఓబీసీ వర్గాలు ఉన్నారని, 5శాతం బడ్జెట్ మాత్రమే దేశంలో ఓబీసీలకు కేటాయిస్తున్నారని, దేశ జనాభాలో ఓబీసీలు 5శాతం మాత్రమే ఉన్నారా అని ప్రశ్నించారు.

Rahul Jgl
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. క్వింటా పసుపుకు రూ.12వేలు ధర కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ప్రేమానుబంధమని.. ఈ అనుబంధం ఈనాటిది కాదని… నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందని అన్నారు. తాను బీజేపీపై పోరాటం చేస్తుంటే… తనపై కేసులు పెట్టారని, లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లు భారత ప్రజలని.. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉందని, తనను ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో.. కానీ ప్రజల హృదయాల్లోంచి కాదని అన్నారు. దేశ సంపదను ప్రధాని మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఇక్కడ కూడా బీసీ కులగణన చేపడతామన్నారు.
అంతకు ముందు జగిత్యాల వచ్చే దారిలో NAC స్టాప్ వద్ద ఆగి అక్కడ ఉన్న ఓ టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోసెలు వేశారు. రాహుల్ గాంధీ దోసెలు వేసిన వీడియోలు , ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దోసెలు వేసిన రాహుల్ దోసెల బండి ఓనర్ కు తినిపించారు. రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ చిన్నారులకు చాక్లెట్లు పంచిన ఫోటోలను..దోసెలు వేసిన ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్టు చేస్తు ..మనలో ఒక్కడు..మనందరి కోసం ఒక్కడు..అతడే మన రాహుల్ గాంధీ అంటూ పేర్కొంది.
Read Also : Political Thriller: ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ చిత్రాలు, పొలిటికల్ మైలేజ్ కోసం బిగ్ స్కెచ్!