Telangana Congress: ప్రియాంక తెలంగాణ పర్యటన వాయిదా
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆమె తన పర్యటనని వాయిదా వేసుకున్నారు.
- By Praveen Aluthuru Published Date - 11:30 AM, Fri - 28 July 23

Telangana Congress: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆమె తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో జూలై 30న కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో ప్రియాంక పాల్గొననున్నారు. అయితే వర్షాల కారణంగా ఆమె పర్యటన రద్దయినట్టు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్ చేపట్టబోయే బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బహిరంగ సభను నిర్వహించడంలో సమస్యలు తెచ్చి పెడతాయి. సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
Also Read: Blue Whale : సముద్రం ఒడ్డున అరుదైన నీలి తిమింగలం..చూసేందుకు తరలివస్తున్న ప్రజలు